Home > జాతీయం > కాంగ్రెస్తో ఎస్పీ పొత్తు ఖరారు.. ఆ సీట్లు ఇచ్చేందుకు అఖిలేష్ ఒకే

కాంగ్రెస్తో ఎస్పీ పొత్తు ఖరారు.. ఆ సీట్లు ఇచ్చేందుకు అఖిలేష్ ఒకే

కాంగ్రెస్తో ఎస్పీ పొత్తు ఖరారు.. ఆ సీట్లు ఇచ్చేందుకు అఖిలేష్ ఒకే
X

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం జరగింది. కాంగ్రెస్-సమాజ్ వాది పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. ఇండియా కూటమిలో భాగంగా ఇరు పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని అఖిలేష్ ప్రకటించారు. పొత్తుల విషయంలో గత కొన్నాళ్లుగా నెలకొన్న సస్పెన్స్కు అఖిలేష్ ప్రకటనతో తెరపడింది. పొత్తులో భాగంగా కాంగ్రెస్కు 19 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు అఖిలేష్ ఒకే అన్నట్లు తెలుస్తోంది. సీట్ల షేరింగ్ పై రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ పొత్తులో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించారు.

అంతకుముందు కాంగ్రెస్ - ఎస్పీ పొత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. గతంలో కాంగ్రెస్కు 11 సీట్లే ఇస్తామని అఖిలేష్ అన్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఎక్కువ సీట్లు కావాలని పట్టుబట్టింది. ఈ అంశంపై గత కొన్ని రోజులుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రియాంక గాంధీ జోక్యంతో పొత్తు ఖరారు అయ్యింది. రెండు పార్టీల మధ్య పొత్తు ఖరారు కావడంతో రాహుల్ పాదయాత్రలో అఖిలేష్ పాల్గొనే అవకాశం ఉంది.

మిగితా రాష్ట్రాల్లో మాత్రం పొత్తుల అంశంలో కాంగ్రెస్కు ఎదురుదెబ్బలు తగిలాయి. పశ్చిబ బెంగాల్లో మమతా బెనర్జీ ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. అక్కడ కాంగ్రెస్ కు రెండే సీట్లు ఇస్తామని చెప్పడంతో ఆ పార్టీ నేతలు ఫైర్ అయ్యారు. మమతా దయాదాక్షిణ్యాలతో పోటీ చేయాల్సిన అవసరం తమకు లేదని అధీర్ రంజన్ చౌదరీ విమర్శించారు. అదేవిధంగా పంజాబ్లోనూ కాంగ్రెస్తో పొత్తు లేదని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. దీంతో ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒంటిరగానే పోటీ చేయనుంది.


Updated : 21 Feb 2024 4:32 PM IST
Tags:    
Next Story
Share it
Top