Home > జాతీయం > Lok Sabha : భద్రతా వైఫల్యాన్ని రాజకీయం చేయొద్దు : స్పీకర్

Lok Sabha : భద్రతా వైఫల్యాన్ని రాజకీయం చేయొద్దు : స్పీకర్

Lok Sabha : భద్రతా వైఫల్యాన్ని రాజకీయం చేయొద్దు : స్పీకర్
X

పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లా కీలక ప్రకటన చేశారు. భద్రతా వైఫల్యాన్ని రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. సభా మర్యాదలు, గౌరవాన్ని అందరూ పాటించాలని.. సభలో జరుగుతున్న గందరగోళాన్ని దేశ ప్రజలు స్వాగతించరని అన్నారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా సభ్యుల ఇచ్చిన సూచనలు అమలు చేస్తామన్నారు. సభలో బిల్లులపై సభ్యులు తమ అభిప్రాయాలను చర్చల ద్వారా సభ ముందు ఉంచాలని సూచించారు. సభలో నిరసనలు, ప్లకార్డులు ప్రదర్శించడం ప్రజలు ఇష్టపడరని తెలిపారు. లోక్ సభ సభ్యుల భద్రత తనదేనని ఓం బిర్లా స్పష్టం చేశారు.

మరోవైపు లోక్ సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. విపక్షాల నిరసనతో లోక్‌సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సభా కార్యకలాపాలను అడ్డుకోవడం సరికాదని.. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలను స్పీకర్ కోరారు. అయినా విపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.


Updated : 18 Dec 2023 2:03 PM IST
Tags:    
Next Story
Share it
Top