Home > జాతీయం > పార్లమెంట్ సభ్యులకు స్పీకర్ లేఖ.. కారణం ఏంటంటే..?

పార్లమెంట్ సభ్యులకు స్పీకర్ లేఖ.. కారణం ఏంటంటే..?

పార్లమెంట్ సభ్యులకు స్పీకర్ లేఖ.. కారణం ఏంటంటే..?
X

డిసెంబర్ 13న పార్లమెంట్ సమావేశాల సమయంలో.. విజిటర్స్ గ్యాలరీ నుంచి ఇద్దరు నిరసనకారులు కలర్ స్మోక్ గ్యాస్ లతో ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా.. పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై ఎంపీలందరికి లేఖ రాశారు. ఈ ఘటన నేపథ్యంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. భద్రతపై వివిధ అంశాలను ఈ కమిటీ సమీక్షిస్తుందని, మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తుందని స్పీకర్ తెలిపారు. ఈమేరకు సభ్యులకు లేఖ రాసిన ఆయన.. కమిటీ నివేదికను త్వరలోనే ప్రకటిస్తామని వివరించారు.

Updated : 16 Dec 2023 8:01 PM IST
Tags:    
Next Story
Share it
Top