Home > జాతీయం > పార్లమెంట్లో రచ్చ.. ఒకేరోజు 92 మంది ఎంపీలు సస్పెండ్

పార్లమెంట్లో రచ్చ.. ఒకేరోజు 92 మంది ఎంపీలు సస్పెండ్

పార్లమెంట్లో రచ్చ.. ఒకేరోజు 92 మంది ఎంపీలు సస్పెండ్
X

పార్లమెంట్ లో పోయిన వారం చోటు చేసుకున్న భద్రతా వైఫల్యం ఘటన నేపథ్యంలో విపక్ష సభ్యుల నిరసనలతో సోమవారం ఉభయ సభలు దద్దరిల్లాయి. పార్లమెంట్ కు రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలంటూ విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతున్న సమయంలో విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనను మాట్లాడకుండా అడ్డుకున్నారు. విపక్షాల నిరసనలతో ఉభయ సభల్లో కార్యకలాపాలు స్తంభించాయి. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నందుకు గాను ఇవాళ ఒక్కరోజే 92 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం గమనార్హం. లోక్

సభలో 47, రాజ్యసభలో 45 మంది ఎంపీలను సస్పెండ్ అయ్యారు. కాగా సభను సజావుగా సాగనీయడం లేదంటూ గతవారం కూడా విపక్షాలకు చెందిన 13 మంది ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

వీరిలో 33 మందిని శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది. మరో ముగ్గిరిని ప్రివిలేజెస్ కమిటీ నివేదిక వచ్చే వరకు సస్పెండ్ చేశారు. శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ అయిన వారిలో.. కాంగ్రెస్‌ సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధరీ, ఆ పార్టీ ఎంపీ గౌరవ్‌ గొగొయ్‌, డీఎంకే ఎంపీలు ఎ.రాజా, టీఆర్‌ బాలు, దయానిధి మారన్‌, టీఎంసీ ఎంపీలు సౌగతా రాయ్‌, కల్యాణ్‌ బెనర్జీ, కకోలి ఘోష్‌, శతాబ్ది రాయ్‌ తదితరులు ఉన్నారు. ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్న క్రమంలో.. లోక్ సభ, రాజ్య సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. విపక్షాలు ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో.. స్పీకర్ ఉభయ సభలను రేపటికి వాయిదా వేశారు.


Updated : 18 Dec 2023 1:52 PM GMT
Tags:    
Next Story
Share it
Top