Home > జాతీయం > Himachal Pradesh : హిమాచల్ రాజకీయ సంక్షోభం.. అసెంబ్లీ నుంచి బీజేపీ సభ్యులు సస్పెండ్

Himachal Pradesh : హిమాచల్ రాజకీయ సంక్షోభం.. అసెంబ్లీ నుంచి బీజేపీ సభ్యులు సస్పెండ్

Himachal Pradesh : హిమాచల్ రాజకీయ సంక్షోభం.. అసెంబ్లీ నుంచి బీజేపీ సభ్యులు సస్పెండ్
X

హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతోన్నాయి. అధికారాన్ని చేపట్టేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. రాజ్యసభలో ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేయడంతో రాజకీయాలు ఒక్కసారిగా మలుపుతిరిగాయి. కాంగ్రెస్ సర్కార్ మైనార్టీలో పడిందని.. వెంటనే ఓటింగ్ చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే దీనిపై గవర్నర్ను కలిసి ప్రభుత్వాన్ని మెజార్టీ నిరూపించుకోవాలని ఆదేశించాల్సిందిగా కోరారు.

మరోవైపు హిమాచల్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా.. ఇవాళస సభలో బీజేపీ సభ్యులు నిరసనకు దిగారు. అసెంబ్లీలో ఓటింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. దీంతో బీజేపీకి చెందిన 15మంది ఎమ్మెల్యేలను స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో బీజేపీ శాసనసభ పక్ష నేత జైరాం ఠాకూర్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో మంత్రి పదవికి విక్రమాదిత్య రాజీనామా చేశారు. ప్రస్తుతం పరిస్థితుల్లో మంత్రిగా కొనసాగలేనని చెప్పారు.

కాగా రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చాయి. ఇద్దరి అభ్యర్థులకు 34 ఓట్లు రావడంతో అధికారులు లాటరీ తీశారు. దీంట్లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహజన్ విజయం సాధించగా.. అభిషేక్ మనుసింఘ్వి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఇవాళ గవర్నర్ను బీజేపీ శాసనసభ పక్ష నేత జయరాం ఠాకూర్ కలిశారు. ప్రభుత్వాన్ని మెజార్టీ నిరూపించుకోవాలని ఆదేశించాల్సింది గవర్నర్ను కోరారు. దీంతో హిమాచల్ రాజకీయాలు మరిన్ని మలుపులు తీసుకోనున్నాయి.

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 40స్థానాల్లో గెలిపొందగా.. బీజేపీ 25, ఇండిపెండెంట్లు 3స్థానాల్లో విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఆరుగు ఎమ్మెల్యేలు బీజేపీ అనుకూలంగా ఓటేయడంతో కాంగ్రెస్ సంఖ్యాబలం 34కు పడిపోయింది. ఇండిపెండెంట్లతో కలుపుకుని అటు బీజేపీకి 34మంది సభ్యుల బలం ఉంది. దీంతో అక్కడి రాజకీయాలు రసవత్తంగా సాగుతోన్నాయి. ఒక్క సభ్యున్ని మద్ధతు కూడగట్టడం బీజేపీ పెద్ద కష్టమేమీ కాదని విశ్లేషకులు చెబుతున్నారు. మరి బీజేపీ రాజకీయాలకు కాంగ్రెస్ చెక్ పెడుతుందా అనేది వెయిట్ అండ్ సీ..


Updated : 28 Feb 2024 7:24 AM GMT
Tags:    
Next Story
Share it
Top