Home > జాతీయం > ఆవు పేడతో తివాచీ.. ప్రధానికి ఇచ్చేందుకు రెడీ

ఆవు పేడతో తివాచీ.. ప్రధానికి ఇచ్చేందుకు రెడీ

ఆవు పేడతో తివాచీ.. ప్రధానికి ఇచ్చేందుకు రెడీ
X

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కానుకగా ఇచ్చేందుకు ఆవు పేడ, గోమూత్రంతో ఓ ప్రత్యేక తివాచీ రూపొందించారు ఓ గోశాల నిర్వాహకులు. ఆయుర్వేద హితామహుడు చరకుడి ప్రేరణతో ఈ తివాచీని తయారుచేశామని చెబుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్‌లో గల మనోహర్‌ అనే పేరు గల గోశాల నిర్వాహకులు .. ప్రధాని కోసం తయారు చేసిన ఈ తివాచీని త్వరలోనే దిల్లీలోని ఆయన నివాసానికి పంపించనున్నారు. ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను చేరుకోడానికి చరకుడు ఇలాంటి తివాచీని వాడారని గోశాల మేనేజింగ్‌ ట్రస్టీ పాదం డాక్‌లియా అన్నారు.14 కిలోలకు పైగా బరువు ఉన్న ఈ కార్పెట్‌ను తయారుచేయడానికి సౌమ్య కామధేను జాతికి చెందిన ఆవుపేడ, మూత్రాన్ని వినియోగించామని చెప్పారు. గోల్డెన్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సాధించిన ఈ రకం ఆవులకు ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు.

ఆవుపేడతో తివాచీలే కాదు.. గతంలో కొందరు రాఖీలు కూడా తయారు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆత్మనిర్భార్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఇండోర్ నగరానికి చెందిన శ్వేతా పలివాల్ అనే మహిళ.. గతంలో ఆవుపేడతో రాఖీలను తయారు చేశారు. పర్యావరణ హిత రాఖీలే కాకుండా గణేష్ చతుర్థి సందర్భంగా వినాయక విగ్రహాలను సైతం తయారు చేశారు. ఇంటి అలంకరణ వస్తువులను తయారుచేసి, అద్బుతమైన పెయింటింగులు వేశారు. ఆవు పేడ, మట్టితో యాంటీ రేడియేషన్ మొబైల్ స్టాండులు, రాఖీలు తయారు చేసి వాటిని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కూడా పంపించారు.

Updated : 28 Dec 2023 3:27 AM GMT
Tags:    
Next Story
Share it
Top