Home > జాతీయం > బైకర్ నిర్లక్ష్యం.. కారు ఢీకొని గాల్లోకి ఎగరిపడిన స్టూడెంట్స్

బైకర్ నిర్లక్ష్యం.. కారు ఢీకొని గాల్లోకి ఎగరిపడిన స్టూడెంట్స్

బైకర్ నిర్లక్ష్యం.. కారు ఢీకొని గాల్లోకి ఎగరిపడిన స్టూడెంట్స్
X

కొందరి నిర్లక్ష్యం మరికొందరి ప్రాణాల మీదికి తెస్తోంది. ప్రధానంగా రోడ్డు ప్రమాదాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చూస్తుంటాం. రోడ్డుపై ప్రయాణించేప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా తమతోపాటు.. ఇతరులను ప్రమాదంలోకి నెట్టేస్తారు. తాజాగా కర్ణాటకలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదమే దీనికి నిదర్శనం. రాయ్‌చూర్‌ జిల్లాలో ఓ బైకర్‌ నిర్లక్ష్యం కారణంగా వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న స్టూడెంట్స్ ను ఢీకొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

రాయ్‌చూర్‌లోని రాఘవేంద్ర పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అవతలిపై నుంచి కారు స్పీడ్ గా వస్తుండగా..బైక్ పై వస్తున్న వ్యక్తి సడెన్ గా యూటర్న్ తీసుకుని రోడ్డు మధ్యలోకి వచ్చింది. దీంతో బైక్ను కారు ఢీకొట్టగా.. దానిని నడపుతున్న వ్యక్తి గాల్లోకి ఎగిరిపడ్డాడు. ఆ తర్వాత అదుపుతప్పిన కారు పక్కనే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న నలుగురు విద్యార్థినులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థినిలు గాల్లోకి ఎగిరిపడిపోయారు.

ఈ ప్రమాదంలో బైకర్కు తీవ్రగాయాలు కాగా.. విద్యార్థినులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్‌ అయ్యింది. ఈ వీడియోను ఓ వ్యక్తి ట్వీట్ చేయడంతో.. సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



Updated : 27 July 2023 4:05 PM IST
Tags:    
Next Story
Share it
Top