యూనిఫామ్ సివిల్ కోడ్పై లా కమిషన్ కీలక సూచన.. ఏమన్నారంటే..?
X
దేశంలో గత కొంత కాలంగా వినిపిస్తున్న మాట ఉమ్మడి పౌరస్మృతి (యునిఫామ్ సివిల్ కోడ్). కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్ట్ సమ్మతితో ఈ నిర్ణయాన్ని తీసుకుంటుంటే.. కొన్ని ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. దేశంలో మతపరమైన చర్చలకు తెరలేపేందుకే మోదీ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ అంటూ విమర్శిస్తున్నాయి. మరికొందరు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. దేశంలో పౌరులందరికీ సమాన హక్కులు కల్పించాలంటే ‘ఉమ్మడి పౌరస్మృతి’ని అమలు చేయాలని కోరుతున్నారు.
ఉమ్మడి పౌరస్మృతి అంటే..?
ఉమ్మడి పౌరస్మృతి (ఆర్టికల్ 44) అనేది దేశంలోని పౌరులందరికీ ఒకే చట్టం ఉండాలని చెప్తుంది. మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలకు అతీతంగా.. వ్యక్తిగత అంశాలపై రూల్స్ అమలు చేయాలని సూచిస్తుంది. పెళ్లిళ్ల నుంచి విడాకుల వరకు.. భరణం నుంచి వారసత్వం వరకు.. ముఖ్యంగా మైనారిటీలకు ‘ముస్లిం పర్సనల్ లా’, ఇలా ప్రతీ ఒక్క వ్యక్తిగత చట్టాల స్థానంలో ఉమ్మడి పౌరస్మృతి ఏర్పాటు చేయాలని చెప్తుంది ఈ ఆర్టికల్.
లా కమిషన్ పేరుతో ఫేక్ మెసేజ్లు:
ఈ క్రమంలో.. ఉమ్మడి పౌరస్మృతిపై అసత్య ప్రచారం జరుగుతోంది. సమాచారం, అభిప్రాయ సేకరణ పేరుతో.. వాట్సాప్ మెసేజ్ లు, ఫోన్లు వస్తున్నాయని, వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లా కమిషన్ అధికారిక వెబ్ సైట్ తో పాటు, న్యూస్ ఛానల్ల ద్వారా మాత్రమే తాము సంప్రదిస్తామని, ప్రజలు వాటిని మాత్రమే అనుసరించాలని కోరింది. ఫోన్ నంబర్లు, వాట్సాప్ గ్రూప్స్ మెసేజ్ లతో తమకు సంబంధం లేదని, వాటికి స్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
The Law Commission of India cautions the people against the fraudulent WhatsApp text, messages and calls being circulated regarding #UniformCivilCode. The Commission clarifies that it has no involvement or connections with these texts.#UCC pic.twitter.com/5tuOJv7O3A
— Live Law (@LiveLawIndia) July 7, 2023