Home > జాతీయం > శుభకార్యాల శ్రావణ మాసం.. పెళ్లి సందడి షురూ..

శుభకార్యాల శ్రావణ మాసం.. పెళ్లి సందడి షురూ..

శుభకార్యాల శ్రావణ మాసం.. పెళ్లి సందడి షురూ..
X

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి పెళ్లి సందడి మొదలుకానుంది. ఆషాడం, అధిక శ్రావణమాసాలతో గత రెండు నెలలుగా పెళ్లి మండపాలు, ఫంక్షన్ హాల్‌లు వెలవెలబోయాయి. అయితే ఈ నెల 18వ తేదీ(రేపటి) నుంచి శుభకార్యాల సందడి రాష్ట్రవ్యాప్తంగా ఉండబోతోంది. ఇప్పటికే పెళ్లిళ్లకు కల్యాణ మండపాలు బుక్‌ అయ్యాయి. ఒక్కో పెళ్లి వేడుక దాదాపు 20 నుంచి 25 రంగాల వారికి ఉపాధి కల్పిస్తోంది. శుభకార్యాలతో వివిధరంగాల వ్యాపారులు, చేతివృత్తులు, ఈవెంట్‌ మేనేజర్లు, బ్యూటీపార్లర్‌ నిర్వాహకులకు డిమాండ్‌ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు ఎక్కువగా జరగనున్నాయి. కాగా, శ్రావణ మాసంలో ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్‌ 10 వరకు ముహూర్తాలు ఉండగా.. ఆ తర్వాత డిసెంబరు 31వరకు ప్రతినెలలోనూ శుభ ముహూర్తాలు ఉన్నాయి.





ఇక సెప్టెంబర్‌ 16 నుంచి అక్టోబర్‌ 14 వరకు కొనసాగే భాద్రపదంలో ఎలాంటి ముహూర్తాలు లేకపోవడంతో ఈ నెలలో వివాహాలు, ఇతర శుభకార్యాల నిర్వహణకు అంతా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పెళ్లి వేడుకలకు సంబంధించి.. మెహందీ, సంగీత్‌, మంగళ స్నానాలు, పెండ్లి తేది, పెండ్లి వేదికలకు ఇప్పటికే అంతా సిద్ధం చేసుకున్నారు. అసలే శ్రావణ మాసం, అందులోనూ శుభకార్యాల సీజన్ కావడంతో ఆడవారు బంగారం ఎక్కువగా కొనుక్కునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా బంగారం షాపులు కూడా కళకళలాడుతున్నాయి.





ఆగస్టులో 18, 19, 20, 22, 26, 29, 30 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి. సెప్టెంబరులో 1, 2, 3, 6, 7, 8 తేదీలు, అక్టోబరులో 18 నుంచి 22 వరకు మళ్లీ 24, 25, 26, 27, 31 తేదీలు, నవంబరులో 1, 8, 9, 10, 11, 16, 17, 18, 19, 22, 23, 24, 25, 29 తేదీల్లో వివాహ ముహూర్తాలు ఉన్నాయి. డిసెంబరులో 3, 6, 7, 14, 15, 16, 17, 19, 20, 21, 22, 23, 24, 25, 27, 29, 31 తేదీల్లో పెళ్లిళ్ల సందడి ఉండనుంది.






Updated : 17 Aug 2023 1:15 PM IST
Tags:    
Next Story
Share it
Top