Home > జాతీయం > సంజయ్ సింగ్ను బయటకు పంపండి.. సాక్షి మాలిక్

సంజయ్ సింగ్ను బయటకు పంపండి.. సాక్షి మాలిక్

సంజయ్ సింగ్ను బయటకు పంపండి.. సాక్షి మాలిక్
X

రెజ్లింగ్ వివాదంపై స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ మరోసారి స్పందించారు. కొత్తగా ఏర్పడిన WFI కమిటీతో తమకు ఎలాంటి సమస్యలేదని, కానీ అధ్యక్షుడు సంజయ్ సింగ్ తోనే ఇబ్బంది ఉందని అన్నారు. WFI మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ తో సంజయ్ సింగ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. బ్రిజ్ భూషణ్ తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నారని అన్నారు. ఆయన నుంచి తమకు రక్షణ కల్పించాలని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాను కోరారు. WFIలో సంజయ్ సింగ్ కు ఎలాంటి ఇన్ వాల్వ్ మెంట్ లేకుండా చూడాలని అభ్యర్థించారు. కాగా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారంటూ అప్పుడు WFIకి చీఫ్ గా ఉన్న బ్రిజ్ భూషణ్ పై ఆరోపణలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఆయనను ఆ పదవి నుంచి తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవల WFIకి ఎన్నికలు నిర్వహించగా సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక ఆయన ఎన్నికను వ్యతిరేకిస్తూ సాక్షి మాలిక్ రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పగా.. బజరంగ్ పూనియా పద్మశ్రీ బిరుదును వెనక్కి ఇచ్చేశాడు. ఇక వినేష్ ఫోగట్ కూడా తనకిచ్చిన అర్జున అవార్డును వెనక్కి ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన కమిటీని రద్దు చేస్తే కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది.

Updated : 3 Jan 2024 11:25 AM GMT
Tags:    
Next Story
Share it
Top