కరెంట్ స్వీచ్ బోర్డులో 15 కోట్ల వజ్రం.. ఎలా దొరికిందంటే..?
X
జోయ్ బాబా ఫెలూనాథ్.. సత్యజిత్ రే డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బెంగాలీలో సూపర్ విక్టరీ కొట్టింది. డిటెక్టివ్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా 1979లో రిలీజైంది. ఈ సినిమాలో ఖరీదైన వజ్రం మిస్సవ్వగా.. చివరకు దుర్గామాత కూర్చున్న సింహం బొమ్మ నోటిలో దొరుకుతుంది. అచ్చం అలాగే కోల్కత్తాలో ఓ ఘటన జరిగింది. కరెంట్ స్విచ్ బోర్డులో 15కోట్ల వజ్రం దొరికింది. దీంతో పోలీసులు కూడా అవాక్కయ్యారు.
2002లో ప్రణబ్ కుమార్ అనే వ్యక్తి వద్ద ఖరీదైన వజ్రం ఉండేది. దాన్ని ధర తెలుసుకునేందుకు అతడు ఇంద్రజిత్ తపాదార్ అనే ఓ మధ్యవర్తిని కలిశాడు. ఆ తర్వాత ఇంద్రజిత్ మరో వ్యక్తితో కలిసి ప్రణబ్ ను భయపెట్టి వజ్రాన్ని కొట్టేశాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇంద్రజిత్ ఇంట్లో వెతికారు. ఎంత వెతికినా దొరకకపోవడంతో కొన్నాళ్లపాటు ఈ అన్వేషణ సాగింది. ఎట్టకేలకు ఓ కరెంట్ స్విచ్ బోర్డులో వజ్రం కన్పించింది.
ఆ వజ్రం ప్రణబ్ దేనని ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చింది. దీన్నికోసం 2కోట్ల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. నిందితుడు ఇంద్రజిత్కు రెండేళ్ల జైలుశిక్ష విధిచింది. నిందితుడు దాన్ని సెషన్స్ కోర్టులో సవాలు చేశాడు. 2 దశాబ్దాలుగా కోర్టులో నలుగుతున్న ఈ కేసులో ఇంద్రజిత్‌ను న్యాయస్థానం మరోసారి నిందితుడిగా నిర్ధారిస్తూ గతవారం తీర్పు ఇచ్చింది. కాగా ప్రణబ్ వద్ద ఉన్న ఆ వజ్రం ధర 15 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.