వందేభారత్ ఎక్స్ప్రెస్పై రాళ్ల దాడి
Mic Tv Desk | 7 Aug 2023 12:33 PM IST
X
X
వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లపై రాళ్ల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లోని బారాబంకిలో వందేభారత్ ట్రైన్ పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఒక కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ఈ ట్రైన్ ఆదివారం ఉదయం 6 గంటలకు గోరఖ్ పూర్ నుంచి లక్నోకు బయలుదేరింది. బారాబంకిలోని సఫేదాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటున్న సమయంలో కొందరు రాళ్ల దాడి చేశారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
వందేభారత్ పై రాళ్ల దాడికి సంబంధించి బారాబంకి పోలీసులు కేసు నమోదుచేశారు. ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించినందుకుగానూ వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. గోరఖ్ పూర్ - లక్నో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఉత్తర్ ప్రదేశ్ లో నడుస్తున్న రెండో ట్రైన్ కాగా.. దీనిని జులై 7న ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు.
Updated : 7 Aug 2023 12:33 PM IST
Tags: national national news vande bharat express uttar pradesh gorakhpur lucknow stones pelted train window damages barabanki safeda railway station police complaint fir pm narendra modi
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire