Home > జాతీయం > Vande Bharat Express: వందే భారత్ ఎక్స్ ప్రెస్పై రెండు రోజుల్లో రెండోసారి రాళ్ల దాడి

Vande Bharat Express: వందే భారత్ ఎక్స్ ప్రెస్పై రెండు రోజుల్లో రెండోసారి రాళ్ల దాడి

Vande Bharat Express: వందే భారత్ ఎక్స్ ప్రెస్పై రెండు రోజుల్లో రెండోసారి రాళ్ల దాడి
X

వందే భారత్ ఎక్స్ పెక్స్ ప్రెస్ పై మరోసారి దాడి జరిగింది. ఇండోర్-నాగ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో కోచ్ అద్దాలు పగిలిపోయాయి. దీంతో కోచ్‌లో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. చింతామన్ స్టేషన్-ఉజ్జయిని మధ్య దాడి జరిగింది. గత రెండురోజులుగా ఈ రైలుపై రాళ్ల దాడి జరుగుతుండటంతో ప్రయాణికుల భద్రతపై ఆందోళన నెలకొంది.

ఇండోర్-భోపాల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ (రైలు నెం. 20911)ను అక్టోబర్ 9 నుంచి నాగ్‌పూర్ వరకు పొడిగించారు. ఉజ్జయిని సెక్షన్‌లోని చింతామన్ స్టేషన్, ఉజ్జయిని మధ్య ఉదయం 6.50 గంటల సమయంలో రైలుపై రాళ్లు విసిరారు. దీంతో కోచ్ నంబర్ సీ-6, సీ-7ల అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనతో రైలులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దాడికి సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులపై ఆర్పీఎఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated : 15 Oct 2023 4:26 PM GMT
Tags:    
Next Story
Share it
Top