Home > జాతీయం > సామాన్యులపై కూరల భారం..ఆకాశాన్నంటుతున్న టమాట ధర

సామాన్యులపై కూరల భారం..ఆకాశాన్నంటుతున్న టమాట ధర

సామాన్యులపై కూరల భారం..ఆకాశాన్నంటుతున్న టమాట ధర
X

కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెరిగిన ధరలతో సామాన్యులు తల్లడిల్లుతున్నారు. నిన్నమొన్నటి వరకు కిలో 20 , 30 రూపాయలు పలికిన టమాట ధర ఇప్పుడు కిలో రూ.120కి చేరుకుని చుక్కలు చూపిస్తోంది. భాగ్యనగరంలోనే కాదు దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉన్న రిటైల్ మార్కెట్లలో ఇదే పరిస్థితి నెలకొంది.

చాలా మంది గృహిణులు నిత్యం వంటల్లో వినియోగించే కూరగాయ టమాట. చాలా తక్కువ ధరల్లో విరివిగా ప్రజలకు అందుబాటులో ఉంటుంది. దీంతో వీటి వినియోగం ఎక్కువగానే ఉంటుంది. అలాంటి టామట ధర ఇప్పుడు వినియోగదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తోంది. కిలో టమాట ధర ఇప్పుడు రూ.120 పలుకుతోంది. టమాటతో పాటు మరిన్ని కూరగాయల ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. మార్కెట్‎లో కిలో పచ్చిమిర్చి ధర రూ.120 నుంచి రూ.160 వరకు ఉంది. బీన్స్ రూ.120 నుంచి రూ.160 పలుకుతోంది.చిక్కుడు కిలో రూ.100 వరకు వ్యాపారులు విక్రయిస్తుండగా . ఇక అల్లం ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరుకుంది. కిలో ధర ఏకంగా రూ.300లు పలుకుతోంది . వెల్లుల్లి కూడా అల్లం బాటలోనే వెళ్తోంది కిలో రూ.240ల వరకు మార్కెట్‎లో ధర ఉంది.


ఇక మిగతా కూరగాయలు బెండకాయలు, బీరకాయలు, దొండకాయల ధరలు కూడా పెరిగాయి. నిన్నమొన్నటి వరకు 20 ,30 కిలో పలికిన కూరగాయల ధరలు సైతం ఇప్పుడు కిలో రూ.60 నుంచి 80 వరకు పెరిగాయి. రైతుబజార్లలో ధరలు కాస్త తక్కువగా ఉన్నా రిటైల్‌ షాపులు, సూపర్ మార్కెట్లలో మాత్రం ధరలు మండిపోతున్నాయి.


వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో గత మూడునెలలుగా రాష్ట్రంలో కూరగాయల పంటల సాగు అంతంత మాత్రంగానే . ఆశించిన స్థాయిలో దిగుబడి రవడం లేదు. రైతులు కూరగాయ పంటలను పెద్దగా సాగు చేయలేదు. దీనికి తోడు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ లో కురిసిన అకాల వర్షాలు పంటను దెబ్బతీశాయి. మే, జూన్‌లలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా కూరగాయ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం మార్కెట్‎లో ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, క్యారెట్‌ ధరలు మాత్రమే వినియోగదారుడికి కాస్త ఊరట కలిగిస్తున్నాయి.

Updated : 28 Jun 2023 10:09 AM IST
Tags:    
Next Story
Share it
Top