Home > జాతీయం > ఇంతకీ ఎవరాయన.. చైనా పుస్తకాల్లో అతని పాఠం ఎందుకుంది?

ఇంతకీ ఎవరాయన.. చైనా పుస్తకాల్లో అతని పాఠం ఎందుకుంది?

ఇంతకీ ఎవరాయన.. చైనా పుస్తకాల్లో అతని పాఠం ఎందుకుంది?
X

భారత్ చిన్న గ్రామంలో పుట్టిన ఆయన.. పొట్ట కూటికోసం దేశాలు తిరిగాడు. డబ్బుల కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటూనే.. సినిమాల్లో చేయాలనే తన ఆశయం కోసం కష్టపడ్డాడు. చివరికి సక్సెస్ అయి.. అతని కథను ఆ దేశ పుస్తకాల్లో పాఠంగా మార్చుకున్నాడు. ఇంతకీ ఎవరతును అంటారా..! ఉత్తరాఖండ్ తెహ్రీ గఢ్వాల్ జిల్లాలో కెమ్రియా సౌర్ అనే ప్రాంతంలో పుట్టాడు దేవ్‌ రథూడీ (46).. బ్రూస్లీ స్పూర్తితో కరాటే చాంపియన్ గా మారాలనుకున్నాడు. ఆ టైంలో కుటుంబ పరిస్థితులు అతని ఆశలాను దూరం చేశాయి. కొన్నాళ్లు ఢిల్లీ వెళ్లి చిన్నచిన్న పనులు చేశాడు. అప్పుడే చైనాలోని ఓ భారతీయ రెస్టారెంట్ లో నెలకు రూ.10వేల జీతంతో జాబ్ వచ్చింది. దాంతో 2005లో చైనా వెళ్లాడు. అక్కడ వెయిటర్ గా పనిచేస్తూ.. 8 ఏళ్ల తర్వాత మేనేజర్ గా ప్రమోషన్ సాధించాడు. ఆ ధైర్యంతోనే చైనాలో రెడ్ ఫోర్ట్ పేరుతో సొంత రెస్టారెంట్ ప్రారంభించాడు. అప్పుడే సినిమాలు చేయాలనే తన చిన్ననాటి కలకు మార్గం దొరికింది.

2017లో అతని రెస్టారెంట్ కు వచ్చిన ఓ చైనా సినిమా డైరెక్టర్.. దేవ్‌ రథూడీను చూసి తన సినిమాలో నటించమని అడిగాడు. దానికి దేవ్ కూడా ఒప్పుకోవడంతో.. స్వాట్ అనే టీవీ సిరీస్ లో చాన్స్ ఇచ్చాడు. ఆ సిరీస్ మంచి హిట్ అవ్వడమే కాకుండా.. దేవ్ యాక్టర్ గా పేరు తెచ్చి పెట్టింది. జీవితం ఒక్కసారిగా మారిపోయింది. దాంతో వరుస అవకాశాలు వచ్చాయి. ఇప్పటి వరకు 35 సినిమాలు, సిరీస్ లలో నటించి స్టార్ గా మారాడు. చైనాలో వెయిటర్ గా జీవితం మొదలుపెట్టిన ఆయన.. ప్రస్తుతం 8 రెస్టారెంట్లు నడుపుతున్నాడు. సొంతూరునుంచి 150 మందిని తీసుకెళ్లి ఉద్యోగం ఇచ్చాడు. తన సక్సెస్ స్టోరీని అక్కడి ప్రజలకు చెప్పేందుకు చైనా అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నాడు. పాఠ్యాంశాల్లో ఆయన కథను పాఠంగా చేర్చారు. షాంగ్జీ ప్రావిన్స్‌ అనే స్కూళ్లో ఏడో తరగతి విద్యార్థుల ఇంగ్లిష్‌ పుస్తకంలో దేవ్‌పై ఓ పాఠం ఉంది.

Updated : 30 July 2023 10:43 AM GMT
Tags:    
Next Story
Share it
Top