Home > జాతీయం > ఢిల్లీలో భూప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన జనం

ఢిల్లీలో భూప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన జనం

ఢిల్లీలో భూప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన జనం
X

ఢిల్లీలో భారీ భూప్రకంపనలు వచ్చాయి. మధ్యాహ్నం 4.15 గంటల సమయంలో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇండ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. నేపాల్లో భారీ భూకంపం రావడంతో దాని ప్రభావంతో ఢిల్లీలో భూమి కంపించింది.

ఇదిలా ఉంటే నేపాల్ లో మరోసారి భారీ భూకంపం వచ్చింది. మధ్యాహ్నం 4గంటల సమయంలో 5.2 తీవ్రతతో భూమి కంపించింది. 6.4 తీవ్రత గల భూకంపం వచ్చిన రెండు రోజుల తర్వాత మళ్లీ భూమి కంపించడం ఆందోళన కలిగిస్తోంది. భూకంపం కారణంగా జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు.


Updated : 6 Nov 2023 4:56 PM IST
Tags:    
Next Story
Share it
Top