Home > జాతీయం > టీచర్ను చెప్పుతో కొట్టిన స్టూడెంట్.. వీడియో వైరల్

టీచర్ను చెప్పుతో కొట్టిన స్టూడెంట్.. వీడియో వైరల్

టీచర్ను చెప్పుతో కొట్టిన స్టూడెంట్.. వీడియో వైరల్
X

టీచర్లు విద్యార్థులను కొట్టడం కామన్. ఒక్కోసారి అది హద్దుమీరితే విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్లను కొట్టిన ఘటనలూ లేకపోలేదు. అయితే ఓ చోట ఓ విద్యార్థి టీచర్ను చెప్పుతో కొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫిజిక్స్ వాలా యాప్ లైవ్ స్ట్రీమింగ్లో ఈ ఘటన జరిగింది.

ఓ టీచర్ విద్యార్థులకు పాఠాలు చెబుతూ ఫిజిక్స్ వాలా యాప్లో లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ స్టూడెంట్ లేచి వచ్చి ఆ ఉపాధ్యాయుడిని చెప్పుతో కొట్టాడు. దీంతో ఆ టీచర్కు ఏం జరుగుతుందో అర్థం కాక ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. అయితే ఆ స్టూడెంట్ ఉపాధ్యాయుడిని ఎందుకు కొట్టాడు.. అసలు ఏం జరిగింది అనేది తెలియాల్సివుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.




Updated : 6 Oct 2023 6:41 PM IST
Tags:    
Next Story
Share it
Top