Delhi Atmosphere : ఢిల్లీలో పట్టపగలే చిమ్మచీకట్లు.. హఠాత్తుగా మారిన వాతావరణం
X
దేశ రాజధాని ఢిల్లీలో హఠాత్తుగా వాతావరణం మారిపోయింది. పట్టపగలే చిమ్మచీకట్లు అలుముకున్నాయి. ఒక్కసారిగా వెదర్ మారడంతో ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అనేక ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నం దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో పగలే చీకట్లు వ్యాపించాయి. దీంతో పగలే రోడ్లపై లైట్లు వేసుకుని వాహనదారులు ప్రయాణిస్తున్నారు. చీకటి కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కసారిగా కురిసిన వర్షంతో జనజీవనం అస్తవ్యస్థమైంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలతో చాలా ప్రాంతాల్లో రోడ్లపైన చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఉత్తర భారత్లో ఢిల్లీతో పాటుగా మరికొన్ని రాష్ట్రాల్లో ఇదే తరహా వాతావరణం ఉందని తాజాగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని ముందుగానే ప్రజలను హెచ్చరించామన్నారు. రుతుపవనాల తిరోగమన సమయంలో తరచుగా ఇలాంటి వాతావరణ మార్పులు ఏర్పడతాయని అధికారులు చెబుతున్నారు.
#WATCH | Delhi: Rain lashes parts of the national capital. (ANI)
— TOI Cities (@TOICitiesNews) September 23, 2023
(Visuals from near India Gate) pic.twitter.com/2kdJcet8yI