Home > జాతీయం > సడెన్ గా నదిలా మారిపోయిన రోడ్డు

సడెన్ గా నదిలా మారిపోయిన రోడ్డు

సడెన్ గా నదిలా మారిపోయిన రోడ్డు
X

ఓ బస్సు మామూలుగా రోడ్డు మీద వెళుతోంది. కానీ ఉన్నట్టుండి బస్సు మునిగిపోయేంత నీళ్ళు చుట్టుముట్టేశాయి. బయటకు రావడానికి లేదు మరోవైపు నీటి ఉధృతికి బస్సే ఏకంగా కొట్టుకుపోతోంది. బస్సు, ప్రయాణాకులను కాపాడేందుకు స్థానికులు నానాపాట్లు పడుతున్నారు. క్రేన్ సాయంతో బస్సు బోల్తా పడకుండా ఉంచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్లో కత్వాలి నది నీటి మట్టం ఉన్నట్టుండి పెరిగిపోయింది. దీంతో హరిద్వారా, నజీబాబాద్ రహదారి మీదకు భారీగా నీరు వచ్చేసింది. రోడ్డే నదేమో అన్నంతగా మారిపోయింది. దీనిలో ఒక బస్సు చిక్కుకుపోయింది. దానిలో దాదాపుగా 25మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికులు, పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. కొంతమందిని రక్షించగలిగారు కానీ ఇంకా కొంతమంది ప్రాణభయంతో బస్సులోనే ఉన్నారు.

2016లో కత్వాలి నది మీద ఉన్న వంతెన పాడైంది. దాంతో వాహనాలన్నీ బ్రిడ్జి కింద నుంచే వెళుతున్నాయి. ప్రస్తుతం పడుతున్న వర్షాలకు నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. దాంతో వరదనీరు ఊర్లలోకి, రోడ్ల మీదకు వచ్చి చేరుతోంది. ప్రయాణికులను ఎలా అయినా కాపాడతామని పోలీసులు చెబుతున్నారు. బస్సు బోల్తా పడకుండా క్రేన్ సహాయం తీసుకుంటున్నారు.




Updated : 22 July 2023 7:52 AM GMT
Tags:    
Next Story
Share it
Top