Home > జాతీయం > బీఎస్ఎఫ్‌లో తొలి మహిళా స్నైపర్.. సుమన్ కుమారి సక్సెస్ స్టోరీ

బీఎస్ఎఫ్‌లో తొలి మహిళా స్నైపర్.. సుమన్ కుమారి సక్సెస్ స్టోరీ

బీఎస్ఎఫ్‌లో తొలి మహిళా స్నైపర్.. సుమన్ కుమారి సక్సెస్ స్టోరీ
X

దేశాన్ని రక్షించడంలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. అలాంటి సాయుధ దళంలోకి మొట్టమొదటిసారి స్నైపర్‌గా ఓ మహిళ ఎంటర్ అయ్యింది. మాటువేసి, దూరం నుంచే శత్రువులను గురి చూసి కాల్పులు జరిపే వారిని స్నైపర్ అని అంటారు. అటువంటి వారికి కఠిన శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం ఆ శిక్షణను పూర్తి చేసిన సుమన్ కుమారి చరిత్రలో తొలిసారి మహిళా స్నైపర్‌గా బాధ్యతలు చేపట్టింది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన సుమార్ కుమారి ఇందౌర్ లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ (సీఎస్‌డబ్ల్యూటీ)లో తన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసింది.

2021లో సుమన్​ కుమారి బీఎస్ఎఫ్‌లో చేరింది. పంజాబ్‌లో ఓ బృందానికి ఆమె నాయకత్వం వహించింది. సరిహద్దుల్లో స్నైపర్ దాడుల ముప్పును గమనించి దానికి సంబంధించిన కోర్సులో చేరారు. ఆ స్నైపర్ శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. అందులో చేరాలనుకునేవారు మానసికంగా, శారీరకంగా దృంఢంగా ఉండాలి. ట్రైనింగ్‌ను తట్టుకోలేక చాలా మంది పురుషులు వెనక్కి వెళ్లిపోయారు. అలాంటి కష్టతరమైన కోర్సును సుమాన్ కుమారి పూర్తి చేశారు. 56 మంది ఎనిమిది వారాల శిక్షణ తీసుకున్నారు. అందులో ఆమె ఒక్కరే మహిళ కావడం విశేషం. ట్రైనింగ్‌లో సుమాన్ కుమారి చూపిన ప్రతిభకు ఆమెను ఎంతో మంది ఉన్నతాధికారులు ప్రశంసించారు.

హిమాచల్‌లోని మండీ జిల్లాకు చెందిన సుమన్ కుమారి తల్లి ఓ సాధారణ గృహిణి. ఆమె తండ్రి ఓ ఎలక్ట్రీషియన్. తన తల్లిదండ్రులు తనను ఎంతగానో ప్రోత్సహించి ముందుకు నడిపారని, చిన్నతనం నుంచి నేర్చుకోవాలనే సంకల్పమే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందని సుమన్ కుమారి తెలిపింది. సుమన్ కుమారి బీఎస్ఎఫ్‌లో చేరిన మొట్టమొదటి మహిళా స్నైఫర్‌గా చరిత్ర సృష్టించారు. దీంతో ప్రస్తుతం దేశం మొత్తం సుమన్ కుమారి ధైర్య సాహసాల గురించి చర్చించుకుంటున్నారు.


Updated : 4 March 2024 10:40 AM IST
Tags:    
Next Story
Share it
Top