Home > జాతీయం > జగన్‌ అక్రమాస్తుల కేసులపై సుప్రీంలో విచారణ

జగన్‌ అక్రమాస్తుల కేసులపై సుప్రీంలో విచారణ

జగన్‌ అక్రమాస్తుల కేసులపై సుప్రీంలో విచారణ
X

జగన్‌ అక్రమాస్తుల కేసులపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అక్రమాస్తుల కేసులో సీబీఐ కేసుల్లో తీర్పు ఇచ్చిన తర్వాత ఈడీ కేసుల్లో తీర్పు ఇవ్వాలని గతంలో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును ఈడీ సుప్రీంలో సవాల్ చేసింది. ఈడీ పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ జరిపింది. సీబీఐ కేసుల్లో తీర్పు తర్వాత ఈడీ కేసుల్లో తీర్పు ఇవ్వాలా..? వద్దా..? అనేది ట్రయల్ కోర్టు నిర్ణయిస్తుందని సుప్రీం చెప్పింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. మరోవైపు సీబీఐ విచారణ ముగిసిన తర్వాతే ఈడీ విచారణ చేపట్టాలని విజయసాయి రెడ్డి, భారతి సిమెంట్ పిటిషన్ వేశారు.

కాగా అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయడంతోపాటు కేసుల విచారణను తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర చోటుకు బదిలీ చేయాలని ఎంపీ రఘురామకృష్ణ రాజు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం.. విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని సీబీఐని ప్రశ్నించింది. కేసుల ఆలస్యానికి తాము బాధ్యులం కాదని సీబీఐ తరుపు వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. దిగువ కోర్టులో వాయిదాలతో తమకు సంబంధం లేదని చెప్పారు. సీబీఐ కాకపోతే ఈ ఆలస్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని కోర్టు ప్రశ్నించింది. దర్యాప్తు సంస్థకే ఆ బాధ్యత ఉంటుందని చెప్పింది.

Updated : 13 Feb 2024 4:15 PM GMT
Tags:    
Next Story
Share it
Top