Home > జాతీయం > సుప్రీంను ఆశ్రయించిన రాహుల్.. ఎల్లుండి విచారణ

సుప్రీంను ఆశ్రయించిన రాహుల్.. ఎల్లుండి విచారణ

సుప్రీంను ఆశ్రయించిన రాహుల్.. ఎల్లుండి విచారణ
X

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పరువు నష్టం కేసులో పడిన శిక్షపై స్టే విధించడానికి నిరాకరిస్తూ గుజరాత్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాహుల్‌ సుప్రీంలో సవాల్‌ చేశారు. ఈ పిటిషన్‌ విచారణకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. ఈ నెల 21న దీనిపై విచారణ చేపడతామని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ ధర్మాసనం తెలిపింది.

2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో అని రాహుల్‌ అన్నారు. ఈ వ్యాఖ్యలపై పరువునష్టం కేసు నమోదైంది. ఈ కేసులో ట్రయల్‌ కోర్టు రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ మార్చిలో తీర్పు చెప్పింది. ట్రయల్‌ కోర్టు తీర్పు వెలువడిన 24 గంటల్లోనే రాహుల్‌పై అనర్హత వేటు వేస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం ప్రకటించింది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దయింది.

ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గుజరాత్ సెషన్స్ కోర్టుకు వెళ్లారు. అయితే సెషన్స్ కోర్టు కూడా కింది కోర్టు తీర్పును సమర్ధించింది. దీంతో రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఆయనకు నిరాశే ఎదురైంది. దీంతో సుప్రీం తలుపుతట్టారు. మరి రాహుల్ కు ట్రయల్ కోర్టు విధించిన శిక్షపై సుప్రీం ఎటువంటి తీర్పునిస్తుందనేది ఉత్కంఠగా మారింది.



Updated : 19 July 2023 9:31 AM IST
Tags:    
Next Story
Share it
Top