Home > జాతీయం > Supreme Court : పతంజలిపై సుప్రీం సీరియస్.. రామ్దేవ్ బాబాపై కేసు నమోదు!

Supreme Court : పతంజలిపై సుప్రీం సీరియస్.. రామ్దేవ్ బాబాపై కేసు నమోదు!

Supreme Court : పతంజలిపై సుప్రీం సీరియస్.. రామ్దేవ్ బాబాపై కేసు నమోదు!
X

యోగా గురు రామ్ దేవ్ బాబాకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. రామ్ దేవ్ బాబా, పతంజరి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణలు.. ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంగళవారం (ఫిబ్రవరి 27) కోర్టు ధిక్కార నోటీసులిచ్చింది. తిరిగి అనుమతులిచ్చే వరకు పతంజలి ఆయుర్వేదిక్ మెడికల్ ఉత్పత్తులపై ఎలాంటి ప్రకటనలు చేయొద్దని ధర్మాసనం ఆదేశించింది. అల్లోపతికి వ్యతిరేకంగా పతంజలి ప్రొడక్ట్స్ ప్రకటనలు ఉన్నాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై చర్యలు చేపట్టిన ధర్మాసనం పతంజలిపై ఆదేశాలు విధించింది.

డయాబెటిస్, ఆస్తమా లాంటి వ్యాధులకు పతంజలి ఆయుర్వేదిక్ మందులు, యోగాతో పూర్తిగా నయం చేయొచ్చని యాడ్స్ వేస్తున్నారు. వీటిని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ తప్పుబట్టింది. రామ్ దేవ్ బాబా మెడిసిన్ వాడకంపై వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని కోర్టులో ఫిర్యాదు చేసింది. రామ్ దేవ్ పై ఐపీసీ188, 169, 504 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయాలని కోరింది.

గతంలో కూడా వీళ్లు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు. కొవిడ్ 19 వ్యాక్సినేషన్ కు వ్యతిరేకంగా రామ్ దేవ్ బాబా క్యాంపెయిన్ నిర్వహించారు. పతంజలి ఆయుర్వేదిక్ వ్యాధుల్ని వెంటనే నయం చేస్తుందని చేసిన యాడ్స్ పై ధర్మాసనం సీరియస్ అయింది. దీనిపై విచారణ చేపట్టింది. ఇలాంటి తప్పుడు ప్రచారంతో ప్రకటనలు చేసినందుకు పతంజలిపై చర్యలు తీసుకుంది.

Updated : 27 Feb 2024 12:22 PM GMT
Tags:    
Next Story
Share it
Top