Home > జాతీయం > గవర్నర్కు ఆ అధికారం లేదు.. మంత్రికి సుప్రీంలో ఊరట..

గవర్నర్కు ఆ అధికారం లేదు.. మంత్రికి సుప్రీంలో ఊరట..

గవర్నర్కు ఆ అధికారం లేదు.. మంత్రికి సుప్రీంలో ఊరట..
X

మనీలాండరింగ్‌ కేసులో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. సీఎం సిఫార్సు లేకుండా మంత్రి పదవి నుంచి గవర్నర్‌ ఆయన్ని తొలగించడం కుదరదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీం.. సెంథిల్‌ను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను తోసిపుచ్చింది. సెంథిల్ను మంత్రివర్గంలో కొనసాగించాలా వద్దా అనేది ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని గతంలో హైకోర్టు తీర్పు

ఇచ్చింది. ఈ తీర్పును ఓ సామాజిక కార్యకర్త సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.

ఈ పిటిషన్పై ఇవాళ సుప్రీం విచారణ జరిపింది. ఒక మంత్రిని తొలగించే అధికారం గవర్నర్‌కు ఉందా లేదా అనే విషయాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. సదరు వ్యక్తి మంత్రిగా కొనసాగాలా వద్దా అనేది ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు స్పష్టం చేసింది. మద్రాస్ హైకోర్టు తీర్పుతో మేం ఏకీభవిస్తున్నాం. ఇందులో ఎటువంటి జోక్యం చేసుకోం’’ అని జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకాతో కూడిన ధర్మాసనం తెలిపింది.

రవాణాశాఖలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి భారీగా సొమ్ము వసూలు చేశారనే ఆరోపణలపై మంత్రి సెంథిల్‌ బాలాజీని ఈడీ గత ఏడాది జూన్‌ 13న అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. ఆ తర్వాత బాలాజీ తన పదవికి రాజీనామా చేయలేదు. ఎంకే స్టాలిన్ ప్రభుత్వం కూడా ఆయన్ను పదవి నుంచి తీసేయలేదు. ఎటువంటి పోర్ట్‌ఫోలియో లేకుండా బాలాజీ మంత్రిగా కొనసాగుతున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టులోనూ సెంథిల్‌కు బెయిల్‌ దక్కలేదు.

Updated : 5 Jan 2024 3:58 PM GMT
Tags:    
Next Story
Share it
Top