Home > జాతీయం > మహిళల మీద వివక్ష చూపించే పదాల తొలగింపు

మహిళల మీద వివక్ష చూపించే పదాల తొలగింపు

మహిళల మీద వివక్ష చూపించే పదాల తొలగింపు
X

కోర్టు విచారణల్లో, తీర్పుల్లో వాడే పదాల మీద సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. స్త్రీల గౌరవాన్ని దెబ్బ తీసే విధంగా ఉండే పదాలను నిషేధించింది. దాదాపు 40 పదాలను తొలగిస్తూ కొత్త హ్యాండ్ బుక్ ను విడుదల చేసింది.

వేశ్య, తిత, విధేయత గల భార్య లాంటి పదాలు ఇక మీదట కోర్టుల్లో వాడకూడదు. వీటి బదులు సున్నితమైన పదజాలాన్ని వాడాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి కొత్త హ్యాండ్ బుక్ ను విడుదల చేవారు. సీజేఐ డీవై చంద్రచూడ్ దీనిని రిలీజ్ చేశారు. గత తీర్పుల్లో , విచారణల్లో వాడిన మూసపదాలు మహిళల గౌరవాన్ని తగ్గించేవిధంగా ఉన్నాయని చంద్రచూడ్ అన్నారు. ఈ పదాలు లింగ వివక్షకు దారితీస్తున్నాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మూస పదాల కారణంగా ఓ వర్గానికి తెలియకుండానే అన్యాయం జరుగుతోందని సీజేఐ తెలిపారు.

సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో 40 మూస పదాలను తొలగించిన కొత్త హ్యాండ్ బుక్ను అప్ లోడ్ చేశారు. ఆ పదాల స్థానంలో వాటి మానసిక స్థితిని తీర్పుల్లో పేర్కొనాలని హ్యండ్ బుక్ లో రాసారు.


Updated : 16 Aug 2023 2:19 PM GMT
Tags:    
Next Story
Share it
Top