Home > జాతీయం > భారతి సిమెంట్స్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ

భారతి సిమెంట్స్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ

భారతి సిమెంట్స్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ
X

భారతి సిమెంట్స్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎఫ్‌డీలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం తోసిపుచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసులో భారతి సిమెంట్స్‌కు చెందిన రూ.150 కోట్లు విడుదల చేయాలని గతంలో ఈడీని హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పును ఈడీ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈడీ వాదనలతో ఏకీభవించిన జస్టిస్‌ అభయ్‌ ఓఖా ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పును మరోసారి పరిశీలించాలని హైకోర్టుకు సూచించింది. ఈ క్రమంలో ఎఫ్‌డీలపై వచ్చిన వడ్డీనైనా విడుదల చేయాలని భారతి సిమెంట్స్ మరో పిటిషన్‌ వేయగా.. అత్యున్నత స్యాయస్థానం దాన్ని కూడా తోసిపుచ్చింది. ఏమైన అభ్యంతరాలు ఉంటే హైకోర్టులో తేల్చుకోవాలని సూచించింది.

మరోవైపు ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. అమరావతి ఆర్ 5 జోన్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై విచారణను ఏప్రిల్‌కు కోర్టు వాయిదా వేసింది. వెంటనే జోక్యం చేసుకుని విచారణ జరపాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ ధర్మాసనం వాయిదా వేసింది. అదేవిధంగా సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ఫిబ్రవరి 15కి వాయిదా పడింది. 20 ఛార్జిషీట్లలో 130 డిశ్చార్జి పిటిషన్లపై విచారణను న్యాయస్థానం ఫిబ్రవరి 15కి వాయిదా వేసింది.

Updated : 5 Jan 2024 4:58 PM IST
Tags:    
Next Story
Share it
Top