Home > జాతీయం > మాజీ సీఎంకు సుప్రీంలో ఎదురుదెబ్బ

మాజీ సీఎంకు సుప్రీంలో ఎదురుదెబ్బ

మాజీ సీఎంకు సుప్రీంలో ఎదురుదెబ్బ
X

ఝార్జండ్ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ అరెస్ట్ను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై విచారణకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ అంశంలో తాము జోక్యం చేసుకోలేమని.. హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం సోరెన్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మనీలాండరింగ్ కేసులో సోరెన్ను ఈడీ బుధవారం అరెస్ట్ చేసింది. నిన్న రాంచీ పీఎంఎల్ఏ కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు ఆయనకు ఒకరోజు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇక ఆయన్ని 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోర్టును కోరగా.. దానిపై న్యాయస్థానం ఇవాళ నిర్ణయం తీసుకోనుంది.

కాగా రూ.600కోట్ల భూకుంభకోణంలో హేమంత్ సోరెన్ పాత్ర ఉందని ఈడీ ఆరోపించింది. భారత సైన్యం ఆధీనంలో ఉన్న భూమిని సోరెన్ అక్రమంగా విక్రయించి లబ్దిపొందారని ఈడీ అభియోగాలు మోపింది. ఈ కేసులో పలుసార్లు ఆయనకు నోటీసులు జారీ చేయగా.. ఆయన ఈడీ విచారణకు హాజరుకాలేదు. ఈ క్రమంలో బుధవారం ఆయన్ను 7గంటల పాటు విచారించిన ఈడీ ఆ తర్వాత అరెస్ట్ చేసింది.

మరోవైపు జేఎంఎం కూటమి నేత చంపై సోరెన్ ఇవాళ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. నిన్న సాయంత్రం ఆయన గవర్నర్ రాధాకృష్ణన్ను కలిసి ఎమ్మెల్యేల మద్ధతు వీడియోను చూపించారు. తనకు 43 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉన్నట్లు గవర్నర్కు తెలిపారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా చంపైను ఆహ్వానించారు. ఇవాళ సాయంత్రం చంపై ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇక 10 రోజుల్లో బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా చంపైకు గవర్నర్ సూచించారు. దీంతో ఝార్ఖండ్ రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. అటు బీజేపీ సైతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతోంది.

Updated : 2 Feb 2024 12:33 PM IST
Tags:    
Next Story
Share it
Top