Home > జాతీయం > Manish Sisodia: మనీష్ సిసోడియాకి బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు

Manish Sisodia: మనీష్ సిసోడియాకి బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు

Manish Sisodia: మనీష్ సిసోడియాకి బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు
X

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అక్రమాలకు సంబంధించిన కేసుల్లో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. స్కాం కి సంబంధించిన అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో ఆయన బెయిల్ పిటిషన్‌లను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. 338 కోట్ల రూపాయల చేతులు మారాయనే దానికి సంబంధించి అంశం తాత్కాలికంగా నిర్ధారించబడిందని బెంచ్ గమనించిందని న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్విన్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. లిక్కర్ కేసులో నగదు లావాదేవీలు జరిగినట్లు ఈడీ ఆధారాలు చూపించినందున .. అందుకే తాము బెయిల్ కోసం చేసిన దరఖాస్తులను తిరస్కరిస్తున్నామని తెలిపింది.

ఇక ఈ లిక్కర్ స్కాం కేసులో విచారణను పూర్తి చేసేందుకు ఈడీకి సుప్రీంకోర్టు 6 నుంచి 8 నెలల సమయం ఇచ్చింది. విచారణ 3 నెలల్లో నెమ్మదిగా సాగితే.. మనీష్ సిసోడియా బెయిల్ కోసం దరఖాస్తును దాఖలు చేయడానికి అర్హులుని ధర్మాసనం తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మనీష్ సిసోడియా బెయిల్ అభ్యర్థనలను దిగువ కోర్టులు తిరస్కరించడంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆయన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ నెల ప్రారంభంలో తన తీర్పును రిజర్వ్ చేసింది. డిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి తనపై రెండు వేర్వేరు కేసుల్లో బెయిల్ కోసం మనీష్ సిసోడియా ప్రయత్నించారు. అందులో ఒకటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసు కాగా, మరొకటి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన కేసు.

Updated : 30 Oct 2023 6:53 AM GMT
Tags:    
Next Story
Share it
Top