Home > జాతీయం > ఢిల్లీలో ఉబర్‌, ర్యాపిడోలకు షాక్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఢిల్లీలో ఉబర్‌, ర్యాపిడోలకు షాక్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఢిల్లీలో ఉబర్‌, ర్యాపిడోలకు షాక్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
X

దేశ రాజధాని ఢిల్లీలో బైక్‌-ట్యాక్సీ సేవలు అందిస్తున్న ర్యాపిడో, ఉబర్‌‌లకు ఊహించని షాక్ తగిలింది. ఢిల్లీలో బైక్ -టాక్సీలను నడపడానికి అనుమతిస్తూ గత నెల 26న జారీ అయిన హైకోర్టు ఉత్తర్వులపై.. భారత సుప్రీంకోర్టు సోమవారం (జూన్ 12న) స్టే విధించింది. తుది విధానాన్ని రూపొందించే వరకు ఢిల్లీ రోడ్లపై బైక్ -టాక్సీలు నడపరాదని తీర్పును ప్రకటిస్తూ సుప్రీంకోర్టు పేర్కొంది.

జులై చివరి నాటికి కొత్త విధానాన్ని తీసుకొస్తామన్న ఆప్‌ ప్రభుత్వ వాదనను జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ రాజేశ్‌ బిందల్‌ ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ర్యాపిడో, ఉబెర్‌లు మోటార్‌ వాహనాల చట్టం-1988ను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంటూ..ఢిల్లీ ప్రభుత్వం గత ఫిబ్రవరిలో బైక్‌-ట్యాక్సీ సేవలను నిషేధించిన విషయం తెలిసిందే.

దీనిపై ఉబర్, ర్యాపిడోలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. వారికి అనుకూలంగా ఉత్తర్వులు వెలువరించింది. ఈ ఉత్తర్వులను కేజ్రీవాల్ సర్కారు సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ రాజేశ్‌ బిందల్‌ ధర్మాసనం.. ఉత్తర్వులను పక్కనబెట్టింది. ‘మా అభిప్రాయం ప్రకారం కొత్త విధానం ఖరారు చేసే వరకు చట్టబద్ధమైన పాలన మొత్తం-స్థాయి కార్యకలాపాలను నిలిపివేసే మధ్యంతర ఉత్తర్వు అసంబద్ధం’ అని ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది.

Updated : 13 Jun 2023 5:06 AM GMT
Tags:    
Next Story
Share it
Top