Home > జాతీయం > సర్వేకు బ్రేక్.. జ్ఞానవాపి మసీదు కేసులో సుప్రీంకోర్టు స్టే..

సర్వేకు బ్రేక్.. జ్ఞానవాపి మసీదు కేసులో సుప్రీంకోర్టు స్టే..

సర్వేకు బ్రేక్.. జ్ఞానవాపి మసీదు కేసులో సుప్రీంకోర్టు స్టే..
X

కాశీ విశ్వనాథుని ఆలయ సమీపంలోని జ్ఞానవాపి మసీదులో సైంటిఫిక్ సర్వేకు బ్రేక్ పడింది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. సర్వేకు అనుమతిస్తూ అలహాబాద్ హై కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 2 రోజుల పాటు సర్వేను నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జులై 26 సాయంత్రం 5 గంటల వరకు మసీదు ప్రాంగణంలో ఎలాంటి సర్వే చేపట్టరాదని ఆదేశించింది.

అలహాబాద్ హై కోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఉదయం ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ సిబ్బంది సర్వేకు సిద్ధమయ్యారు. పోలీసుల బృందం ముందుగా లోపలికి వెళ్లగా ఆ తర్వాత 40 మంది ఏఎస్‌ఐ అధికారులు లోనికి వెళ్లారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు.. సీల్‌ వేసిన ప్రాంతాన్ని మాత్రం సర్వే నుంచి మినహాయించారు. ఒకవైపు సర్వే జరగుతున్న సమయంలోనే.. మసీదు నిర్వాహణ కమిటీ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సర్వేను తాత్కాలికంగా ఆపేయాలని ఏఎస్‌ఐను ఆదేశించింది.


Updated : 24 July 2023 12:35 PM IST
Tags:    
Next Story
Share it
Top