Home > జాతీయం > జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
X

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరిపుతోంది. ఆ ఆర్టికల్ వల్ల భారతీయులు కశ్మీర్‌లో ప్రాథమిక హక్కులకు దూరమయ్యారని సీజేఐ డీవై చంద్రచూడ్ అన్నారు. 370 వల్ల ప్రభుత్వ ఉద్యోగాలలో దేశ పౌరులందరికీ సమాన అవకాశాలు దక్కలేదని, ఆస్తులు కొని, స్థిరపడే హక్కు పోయిందని పేర్కొన్నారు. అలాగే కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించిన జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లకు తిరిగి రాష్ట్ర హోదా ఎప్పట్లోగా కల్పిస్తారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. కశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. ‘‘కేంద్రపాలిత ప్రాంతాలను తిరిగి రాష్ట్రాలుగా, రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చొచ్చా?’’ అని ప్రశ్నించారు. దీనికి సొలిటిటర్ జనరల్ తుషార్ మెహతా సమాధానమిస్తూ, అలాంటి వీలు ఉందని అస్సాం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్‌లను ప్రస్తావించారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్రం.. జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలను నెలకొనగానే రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. ఈమేరకు పార్లమెంటులో ప్రకటన కూడా జారీ చేసిందని మెహతా గుర్తు చేశారు.

Updated : 29 Aug 2023 9:16 AM GMT
Tags:    
Next Story
Share it
Top