Home > జాతీయం > అన్న అజిత్‌ పవార్‌కు సుప్రియా సూలే కౌంటర్

అన్న అజిత్‌ పవార్‌కు సుప్రియా సూలే కౌంటర్

అన్న అజిత్‌ పవార్‌కు సుప్రియా సూలే కౌంటర్
X

NCP అధ్యక్షుడు శరద్ పవార్‌ నుద్దేశించి ఆ పార్టీ తిరుగుబాటు నేత అజిత్‌ పవార్‌ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ సుప్రియా సూలే మండిపడ్డారు. బీజేపీలో నేతలు 75 ఏళ్లకే రిటైర్ అవుతారని.. 83 ఏండ్ల వయస్సున్న మీరు ఇంకెప్పుడు రిటైరవుతారంటూ అజిత్ వెటకారపు మాటలపై సరైన కౌంటర్ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ.. "ఇప్పుడు సీనియర్‌గా ఉన్నవారు మాకు ఆశీస్సులు ఇవ్వాలని కొందరు అంటున్నారు. వారు పనిచేయడం మానేశారా? యాక్టివ్ గా లేదా? రతన్ టాటాకు 86 ఏళ్లు. సీరమ్ ఇనిస్టిట్యూట్‌కి చెందిన సైరస్ పూనావాలా వయస్సు 84. అమితాబ్ బచ్చన్ వయస్సు 82.." అని సుప్రియా సూలే అన్నారు. వారెన్ బఫెట్ , ఫరూక్ అబ్దుల్లా పేర్లు కూడా ఆమె ప్రస్తావించారు. వారు( శరద్ పవార్) వయస్సు మీద పడినా.. యాక్టివ్ గా పనిచేస్తున్నారు. మీ కోపం నాపైనే కదా.. కాబట్టి మమ్మల్ని తిట్టినా సహిస్తాం. కానీ మా నాన్నను కాదు అగౌరవపరిస్తే.. మాత్రం సహించబోం" అని ఆమె అన్నారు.





బుధవారం ఓ సమావేశంలో అజిత్ పవార్ మాట్లాడుతూ..'ఇప్పుడు మీ వయసు 83 ఏండ్లు.. ఇంకెప్పుడు రిటైరవుతారు?’ అని సూటిగా ప్రశ్నించారు. కొన్ని పార్టీల్లో నేతలు ఒక వయసు వచ్చిన తర్వాత పక్కకు తప్పుకొంటున్నారని, అదేవిధంగా మీరు కూడా కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని అన్నారు. ఈ వ్యాఖ్యలను ఖండించిన సుప్రియా సూలే.. "మా తండ్రి(శరద్ పవార్‌ను ఉద్దేశించి) గురించి అగౌరవంగా మాట్లాడితే తట్టుకోలేం. మా పోరాటమంతా BJP ప్రభుత్వంపైనే. అది అత్యంత అవినీతిమయమైన పార్టీ " అని అన్నారు. అదే సమయంలో, శరద్ పవార్ నివాసం వెలుపల కూడా అలాంటి పోస్టర్లు ఏర్పాటు చేయబడ్డాయి. ‘83 ఏళ్ల యోధుడు ఒంటరి పోరాటం’ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. శరద్ పవార్ నివాసం వెలుపల ఈ నినాదంతో కూడిన పోస్టర్లు అంటించారు.




Updated : 6 July 2023 7:47 AM GMT
Tags:    
Next Story
Share it
Top