Surat Diamond Bourse : భారత్ అరుదైన రికార్డు.. అమెరికాను వెనక్కి నెట్టి..
X
ప్రపంచంలోనే అతి పెద్ద జనాభా ఉన్న దేశం.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం ఉన్న దేశం, అత్యధిక సినిమాలు తయారయ్యే దేశం.. ఇలా మరెన్నో రంగాల్లో వరల్డ్‌లో నంబర్ వన్ స్థానంతో భారత్ సత్తా చాటుతోంది. తాజా మరో అరుదైన రికార్డును సృష్టించింది. అమెరికా, జపాన్, చైనా తదితర దేశాలను వెనక్కి నెట్టి కాలర్ ఎగరేసింది. ప్రపంచంలో అతిపెద్ద ఆఫీస్ ఇండియాలో రూపుదిద్దుకుంది. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో నిర్మించిన ఈ కార్యాలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.
ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ రికార్డ్ అమెరికా రక్షణ విభాగమైన ‘పెంటగాన్’ పేరుతో ఉంది. అయితే గుజరాత్లో నిర్మించిన సూరత్ డైమండ్ బోర్స్ పెంటగాన్ కంటే పెద్దది. పెంటగాన్ ఆఫీస్ విస్తీర్ణం 65 లక్షల చదరపు అడుగులు కాగా.. సూరత్ డైమండ్ బోర్స్ విస్తీర్ణం 67 లక్షల చదరపు మీటర్లు. ప్రపంచ వజ్రాల రాజధానిగా పేరొందిన సూరత్ వ్యాపారులు దీన్ని నిర్మించారు. మొత్తం 35 ఎకరాల విస్తీర్ణంలో రూ. 3,400 కోట్లతో ఈ భవన సముదాయాన్ని నిర్మించారు. ఈ భవనాలన్నింటికి కూడా మధ్యలో మరో భవనం అనుసంధానంగా ఉంటుంది. దీనినే ఈ ఆఫీస్‌కు వెన్నెముకగా చెప్పొచ్చు.
ప్రపంచవ్యాప్తంగా వజ్రాల కొనుగోలుదారుల బిజినేస్ చేసుకోవడానికి ఇది అది పెద్ద వేదికగా నిలవనుంది. ఈ బిల్డింగ్లో 4,500 కార్యాలయాలు ఉండగా.. ప్రస్తుతం 130 కార్యాలయాలు వాడుకలో ఉన్నాయి. ఈ క్యాంపస్‌లో పలు కార్యాలయాలతోపాటు సేఫ్ డిపాజిట్ వాల్ట్‌లు, కాన్ఫరెన్స్ హాల్స్, మల్టీపర్పస్ హాల్స్, రెస్టారెంట్స్, బ్యాంకులు, కస్టమ్స్ క్లియరెన్స్ హౌస్, కన్వెన్షన్ సెంటర్, ఎగ్జిబిషన్ సెంటర్‌లు, ట్రైనింగ్ సెంటర్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్, రెస్టారెంట్స్, సెక్యూరిటీతో పాటు క్లబ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ భారీ నిర్మాణం దేశానికి అతిపెద్ద కస్టమ్స్ క్లియరెన్స్ హౌస్‌గా కూడా గుర్తింపు పొందింది. అంతేకాకుండా లక్షల మంది ఉపాధి పొందే అవకాశం ఉంది.