Home > జాతీయం > Ayodhya Temple : అయోధ్య రామమందిర విరాళం.. అత్యధికంగా సమకూర్చింది ఈయనే..!

Ayodhya Temple : అయోధ్య రామమందిర విరాళం.. అత్యధికంగా సమకూర్చింది ఈయనే..!

Ayodhya Temple : అయోధ్య రామమందిర విరాళం.. అత్యధికంగా సమకూర్చింది ఈయనే..!
X

దశాబ్ధాల కాలంగా హిందువులంతా ఎదురుచూసిన రామ మందిర ప్రారంభోత్సవం ఇవాళ (జనవరి 22) వైభవంగా జరిగింది. ఈ మాహాకార్యం కోసం దేశ విదేశాల నుంచి ఎంతోమంది రామ భక్తులు తమ వంతు సాయాన్ని అందించారు. ఇందులో రోజువారీ కూలీలతో పాటు పెద్ద పెద్ద వ్యాపారులు సైతం ఉన్నారు. వీరిలో అత్యధికంగా సూరత్ కు చెందిన దిలీప్ కుమార్ వి లాఖి ముందుంటారు. దిలీప్ కుమార్ సూరత్ లో వజ్రాల వ్యాపారి. రామమందిర నిర్మాణం కోసం ఆయన 101 కిలోల బంగారం స్వామికి సమర్పించారు. ఈ బంగారాన్ని రామాలయంలో తలుపులు, గర్భగుడి, స్తంభాలు, త్రిశూలం, డమరుకు బంగారు తాపడాలకు వినియోగించారు. ప్రస్తుత మార్కెట్ లో బంగారం రేట్ 10 గ్రాములకు రూ. 68వేలు ఉండగా.. దీని ప్రకారం దిలీప్ కుమార్ చేసిన విరాళం విలువ రూ.68 కోట్లపైనే ఉంటుంది.

కాగా రామ మందిర ట్రస్టుకు వచ్చిన విరాళాల్లో ఇప్పటి వరకు ఇదే అత్యధిక మొత్తం అని తెలుస్తోంది. ఈయనే కాకుండా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మొరాయ్‌ బాపూ రూ.11.3 కోట్లు.. విదేశాల నుంచి మరో రూ.8 కోట్లు సమకూరాయి. గుజరాత్‌కు చెందిన మరో వజ్రాల వ్యాపారి గోవింద భాయ్‌ ఢోలాకియా రూ.11 కోట్లు విరాళమిచ్చారు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి రామ మందిరం కోసం రూ.కోటి విరాళం ఇవ్వాలనుకున్నాడు. అందుకు తనకున్న 16 ఎకరాలు అమ్మగా.. పూర్తి డబ్బు సమకూరలేదు. దాంతో మరో 15 లక్షలు అప్పుచేసి రూ.కోటి విరాళం అందించాడు.




Updated : 22 Jan 2024 7:42 PM IST
Tags:    
Next Story
Share it
Top