Home > జాతీయం > Sanjeev Kapoor : వంటలు చేస్తూ రూ.750 కోట్లు సంపాదించిన చెఫ్

Sanjeev Kapoor : వంటలు చేస్తూ రూ.750 కోట్లు సంపాదించిన చెఫ్

Sanjeev Kapoor : వంటలు చేస్తూ రూ.750 కోట్లు సంపాదించిన చెఫ్
X

సాధించాలని తపన ఉంటే కొండనైనా ఢీకొనవచ్చు అనే సామెత అందరికి తెలిసినదే... ఈ మాట ఇండియన్ సూపర్ కుక్ సంజీవ్ కపూర్‌కు సరిగ్గా సరిపోతుంది. కృషి పట్టుదలతో వంటనే వృత్తిగా ఎంచుకుని రూ.750 కోట్ల సామ్రాజాన్ని సృష్టించాడు. ఇంతకీ ఆయన జర్నీ ఎలా సాగింది. జీరో నుండి హీరోగా ఎలా మారాడు. సంజీవ్ సక్సెస్ స్టోరీ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పంజాబ్, అంబాలాలో 1964 ఏప్రిల్ 10 జన్మించిన సంజీవ్ కపూర్.. న్యూ ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ క్యాటరింగ్ అండ్‌ న్యూట్రిషన్ నుండి హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా పట్టా పొందారు.

చదవు పూర్తైనా వెంటనే ప్రియురాలు అలియోనా కపూర్‌ను వివాహం చేసుకున్నాడు. కాలేజీ నుండి బయటకు వచ్చిన అనంతరం 1984లో తన వృత్తిని ప్రారంభించి వివిధ టీవీ ఛానెల్స్ వంటల స్రోగామ్స్ చేస్తూ కోట్లాది రూపాయులను సంపాదించాడు. ఇలా ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ రూ. 750 కోట్లా సామ్రాజ్యాన్ని సృష్టించాడు.

1992లో ప్రారంభమైన ఓ టీవీ షోని ఏకధాటిగా 18 ఏళ్ళు నడిపించిన ఘనత ఆయన సొంతం. ఆయన వంటలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. పంజీవ్ సోషల్ హ్యండిల్స్‌కు లక్షల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు. 120 దేశాలలో ప్రసారమైన ఆయన వంటల షోకు ఇంటర్నెట్ అంతా ప్రాచుర్యంలో లేకపోయిన కూడా 500 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించడం విశేషం. దీంతో తనకున్న ఫాలోయింగ్‌ను గ్రహించి జనవరి 2011లో ఫుడ్‌ అండ్‌ లైఫ్‌ స్టయిల్‌ ఛానెల్‌ని ప్రారంభించిన తొలి చెఫ్‌గా సంజీవ్ నిలిచారు. ఆయన హోస్ట్ చేసిన ఖానా ఖజానా ఇండియన్ టెలివిజన్ అకాడమీ (ITA) బెస్ట్ కుకరీ షో బహుమతిని పలుమార్లు అందుకుంది.

తర్వాత వండర్‌చెఫ్ అనే కంపెనీని స్థాపించిన సంజీవ్ కపూర్.. గతేడాది ఆ సంస్థ ఆదాయాన్ని రూ.700 కోట్లకు తీసుకెళ్లారు. వండర్‌చెఫ్‌ను ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాలనే ప్లాన్‌లో భాగంగా 100 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టాలని సంజీవ్ యోచిస్తున్నారు. వీటిలో 40 శాతం విదేశీ పెట్టుబడులు ఉన్నాయి. ఇప్పటికే సంజీవ్ కపూర్ ఇండియాతోపాటు, పలు దేశాల్లో రెస్టారెంట్స్‌‌ను నిర్వహిస్తున్నారు.

Updated : 6 Jan 2024 2:29 PM IST
Tags:    
Next Story
Share it
Top