Bansuri Swaraj : తెలంగాణ చిన్నమ్మ కూతురుకు బీజేపీ టికెట్
X
లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. తొలి విడత 195 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఈ తొలి జాబితాలో మహిళలకు 28, యువతకు 47 , ఎస్సీ 27, ఓబీసీ 57, ఎస్టీలకు 18 స్థానాల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. తొలి జాబితాలో 34 మంది కేంద్రమంత్రులకు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులకు చోటు దక్కింది. ఇక తెలంగాణలోని 9స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. అయితే తెలంగాణ చిన్నమ్మగా పేరుగాంచిన దివంగత సుష్మాస్వరాజ్ కూతురుకు బీజేపీ టికెట్ లభించింది.
బాన్సురి స్వరాజ్కు బీజేపీ న్యూఢిల్లీ టికెట్ ఇచ్చింది. సుప్రీం కోర్టు అడ్వకేట్ అయిన బాన్సురి స్వరాజ్ ఈ ఎన్నికలతోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారు. బీజేపీ తనకు టికెట్ ఇవ్వడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ‘‘ నాకు మా అమ్మ ఆశీస్సులు ఉన్నాయి. నా తల్లి వారసత్వాన్ని నిలబెడతాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డాకు ప్రత్యేక ధన్యవాదాలు. మోదీ హ్యాట్రిక్ పీఎం అవ్వడా ఖాయం. ఈ సారి బీజేపీ 400 సీట్లు సాధించడంలో నా వంతు కృషి చేస్తాను’’ అని బాన్సురి తెలిపింది.
ఇక ప్రధాని మోదీ మళ్లీ వారణాసి నుంచే పోటీ చేస్తున్నారు. అమిత్ షా గాంధీ నగర్, రాజ్నాథ్ సింగ్ లక్నో నుంచి పోటీ చేస్తున్నారు. ఇక తెలంగాణలో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. అందులో ముగ్గురు సిట్టింగులకు మళ్లీ టికెట్ ఇచ్చింది. సికింద్రాబాద్ - కిషన్ రెడ్డి, కరీంనగర్ - బండి సంజయ్, నిజామాబాద్ - ధర్మపురి అర్వింద్ బరిలో నిలిచారు. మల్కాజిగిరి - ఈటల రాజేందర్, జహీరాబాద్ - బీబీ పాటిల్, హైదరాబాద్ - మాధవీ లత, భువనగిరి - బూర నర్సయ్య గౌడ్ , చేవేళ్ల - కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నాగర్ కర్నూల్ - పి.భరత్ లకు తొలి జాబితాలో చోటు దక్కింది.
Krishna
సట్టి కృష్ణ.. Mic Tv websiteలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఈయనకు జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో V6 News, CVR news,Mojo Tv, 6TV వంటి పలు ఛానళ్లలో పనిచేశారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమా, అనాలిసిస్లు రాయగలరు.