చందమామను హిందూ దేశంగా ప్రకటించండి ..స్వామి చక్రపాణి డిమాండ్
X
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి ల్యాండర్ మనదే కావడంతో ప్రపంచ దేశాలు భారత్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. ఈ విజయం చాలా గొప్పదని.. దాని గురించి ఎంత చెప్పినా తక్కువేనని ఇటీవలె భారత ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్‌లో అన్నారు. దీంతో అందరి చూపి ఇప్పుడు జాబిల్లిపై పడింది. ఇదే క్రమంలో తాజాగా వివాదాల స్వామీజీ జాబిల్లిప చేసిన కామెంట్స్ ఇప్పుడు సెన్సేషనల్‌గా మారాయి. చంద్రయాన్-3 ల్యాండ్ అయిన ప్రదేశాన్ని క్యాపిటల్‌గా హిందూ రాజ్యంగా ప్రకటించాలని డిమాండ్ చేశాడు. దీంతో ఈ వ్యాఖ్యలపై నెట్టింట్లో పెద్ద చర్చ జరుగుతోంది.
కాంట్నవర్సీ కామెంట్స్, విచిత్ర విన్యాసాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి. తాజా మూన్ మిషన్ ను టార్గెట్ చేసిన ఈ స్వామిజీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఈ స్వామీజీ విచిత్రమైన డిమాండ్‌తో ముందుకు రావడంతో అందరూ ముక్కుమీద వేలేసుకుంటున్నారు. చందమామపై చంద్రయాన్-3 సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్ అయిన ప్రదేశాన్ని రాజధానిగా , జాబిల్లిని హిందూ దేశంగా ప్రకటించాలని స్వామి చక్రపాణి మహరాజ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేరే మతాల కంటే ముందుగానే జాబిల్లిపై హక్కులను సొంతం చేసుకోవాలని భారత్ సర్కార్‌ను కోరారు. అంతే కాదు పార్లమెంట్ తక్షణమే ఈ తీర్మానాన్ని ఆమెదించాలని డిమాండ్ చేశారు. టెర్రరిస్టులు చందమామ దగ్గరికి చేరుకోకముందే ప్రభుత్వం సత్వరంగా స్పందించాలని సూచనలు చేశారు. శివశక్తి పాయింట్‌ను హిందూ క్యాపిటల్‌గా డెవలప్ చేయాలని చెబుతున్నారు.
Declare moon as Hindu Rastra..controversy swamiji Chakrapani Maharaj demand central Government
Swami Chakrapani Maharaj, Demand, chandrayan 3, Chandrayaan-3 Success, moon mission, India, Hindu Rashtra, twitter, tweet, latest, viral video, centra government, Indian Government, swamiji, national news, National President, All India Hindu Mahasabha, Indian Parliament, pass resolution , terrorists, Chandrayaan-3 landing site, controversy swamiji, Declare Moon a Hindu Rashtra, Prime Minister, Narendra Modi , Shiv Shakti Point, ISRO, Indian Space Research Organisation , Vikram lander landed
संसद से चांद को हिंदू सनातन राष्ट्र के रूप में घोषित किया जाए,चंद्रयान 3 के उतरने के स्थान "शिव शक्ति पॉइंट" को उसकी राजधानी के रूप में विकसित हो ,ताकि कोई आतंकी जिहादी मानसिकता का वहा न पहुंच पाए 🌸🙏🌸स्वामी चक्रपाणि महाराज, राष्ट्रीय अध्यक्ष, अखिल भारत हिंदू महासभा/ संत महासभा pic.twitter.com/HPbifYFZzX
— Swami Chakrapani Maharaj (@SwamyChakrapani) August 27, 2023