Home > జాతీయం > ‘పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యావా’..? స్వర భాస్కర్పై నెటిజన్స్ ట్రోలింగ్!

‘పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యావా’..? స్వర భాస్కర్పై నెటిజన్స్ ట్రోలింగ్!

‘పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యావా’..? స్వర భాస్కర్పై నెటిజన్స్ ట్రోలింగ్!
X

దేశంలో లివిన్ రిలేషన్షిప్ ట్రెండ్ కు బాలీవుడ్ తెరలేపింది. అదే బాటలో చాలామంది సెలబ్రిటీలు నడుస్తున్నారు. సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే ‘ప్రెగ్నెంట్ అయ్యమంటూ’ బాంబు పేల్చుతున్నారు. తాజాగా అలాంటి వార్తే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ విషయంలో బాలీవుడ్ నటి స్వర భాస్కర్ ను నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

ఈ ఏడాది మొదట్లో స్వర భాస్కర్.. సమాజ్ వాది పార్టీ నేత ఫహద్ అహ్మద్ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. మొదట రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఈ జంట.. ఆ తర్వాత కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అంతకు ముందు ఈ ఇద్దరు సీక్రెట్ గా డేటింగ్ చేశారు. అయితే, ఇటీవలే స్వర భాస్కర్ తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. తాజాగా ఆవిడ ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. తమ అభిమాన నటి బేబీ బంప్ తో కనిపించేసరికి ఖుష్ అయిన అభిమానులు.. స్వర భాస్కర్ ను ఫొటోలు తీశారు.

ఈ విషయంలో స్వర భాస్కర్ ను టార్గెట్ చేసిన నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ‘మొన్ననే కదా పెళ్లయింది. అప్పుడే ప్రెగ్నెంట్ అయ్యావా’, ‘ఆవిడకు పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ వచ్చింది’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Updated : 19 Jun 2023 9:00 PM IST
Tags:    
Next Story
Share it
Top