Home > జాతీయం > రైళ్లలో స్విగ్గీ డెలివరీ.. ఫుడ్ సమస్యకు ఇక చెక్

రైళ్లలో స్విగ్గీ డెలివరీ.. ఫుడ్ సమస్యకు ఇక చెక్

రైళ్లలో స్విగ్గీ డెలివరీ.. ఫుడ్ సమస్యకు ఇక చెక్
X

రైళ్లలో ప్రయాణించేటప్పుడు అందరికీ ఎదురయ్యే ప్రధాన సమస్య ఫుడ్. నచ్చిన ఫుడ్ విషయం అటుంచితే.. కొంచెం నాణ్యమైన ఆహారం తినడం కష్టం. ఈ సమస్యకు స్విగ్గీ చెక్ పెట్టింది. రైలు ప్రయాణికులు ఇకపై తమకు కావాల్సిన ఫుడ్ ను రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆ ఫుడ్ స్విగ్గీ డెలివరీ చేయనుంది. ఈ మేరకు ఐఆర్సీటీసీ, స్విగ్గీ మధ్య మంగళవారం అవగాహన ఒప్పందం జరిగింది. మార్చి 12 నుంచి ఈ సేవలు రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. అయితే ప్రయోగాత్మకంగా తొలుత విశాఖపట్నం, విజయవాడ, భువనేశ్వర్, బెంగళూరు రైల్వే స్టేషన్స్ లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసేందుకు ఐఆర్సీటీసీ యాప్ ను వినియోగించాల్సి ఉంటుంది. టికెట్ లోని పీఎన్ఆర్ నెంబర్ ను ఎంటర్ చేసి కావాల్సిన ఫుడ్ ను ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ సర్వీస్ నుంచి ప్రయాణికులకు మంచి స్పందన వస్తుందని స్విగ్గీ సీఈఓ రోహిత్ కపూర్ ఆశిస్తున్నారు. ఇది సక్సెస్ అయితే దీన్ని మరికొన్ని స్టేషన్లకు విస్తరించే అవకాశం ఉందని చెప్తున్నారు. కాగా రానున్న రోజుల్లో మరో 59 స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Updated : 5 March 2024 2:21 PM GMT
Tags:    
author-thhumb

Krishna

సట్టి కృష్ణ.. Mic Tv websiteలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఈయనకు జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో V6 News, CVR news,Mojo Tv, 6TV వంటి పలు ఛానళ్లలో పనిచేశారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమా, అనాలిసిస్లు రాయగలరు.


Next Story
Share it
Top