Home > జాతీయం > CM Nitish Kumar : అసెంబ్లీలో ఆడోళ్లపై వ్యాఖ్యలు.. వెనక్కి తగ్గి క్షమాపణలు చెప్పిన సీఎం

CM Nitish Kumar : అసెంబ్లీలో ఆడోళ్లపై వ్యాఖ్యలు.. వెనక్కి తగ్గి క్షమాపణలు చెప్పిన సీఎం

CM Nitish Kumar : అసెంబ్లీలో ఆడోళ్లపై వ్యాఖ్యలు.. వెనక్కి తగ్గి క్షమాపణలు చెప్పిన సీఎం
X

బీహార్ అసెంబ్లీలో మంగళవారం జనాభా నియంత్రణ అంశం గురించి మాట్లాడుతూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. ఎట్టకేలకు మహిళలకు క్షమాపణలు చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనక్కి తగ్గారు. అసెంబ్లీలో ప్ర‌తిప‌క్షాలు ఇవాళ నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డంతో త‌న వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు సీఎం నితీశ్ తెలిపారు. చ‌దువుకున్న మ‌హిళ‌లను కించ‌ప‌రిచేలా అసెంబ్లీలో చేసిన కామెంట్ ప‌ట్ల ఆయ‌న ఇవాళ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. నితీష్ కుమార్ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖా శర్మ, ఢిల్లీ మహిళా ప్యానెల్ హెడ్ స్వాతి మలివాల్‌లు విరుచుకుపడ్డారు. నితీష్ వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

మంగళవారం అసెంబ్లీలో కుల గ‌ణ‌న రిపోర్టును ప్ర‌వేశ‌పెట్టిన త‌ర్వాత సీఎం నితీశ్ ఆ అంశంపై మాట్లాడుతూ.. జ‌నాభా నియంత్ర‌ణ విష‌యంలో మ‌హిళా పాత్ర కీల‌క‌మైంద‌ని అన్నారు. రాష్ట్రంలో పున‌రుత్ప‌త్తి రేటు త‌గ్గిన అంశం గురించి స‌భ‌లో చ‌ర్చిస్తూ.. భార్య చ‌దువుకున్న‌దైతే .. గ‌ర్భం రాకుండా శృంగారం ఎలా చేయాలో తెలుస్తుంద‌ని అన్నారు. సెక్స్ ఎడ్యుకేష‌న్ అవ‌స‌ర‌మ‌ని చెబుతూనే.. చ‌దువుకున్న మ‌హిళ‌ల‌కు ఆ విషయాల గురించి తెలుస్తుంద‌ని అన్నారు. చ‌దువుకున్న మ‌హిళ‌ల వ‌ల్ల జ‌నాభా నియంత్ర‌ణ జ‌రుగుతుంద‌ని ఆయ‌న త‌న ప్ర‌సంగంలో తెలిపారు. మహిళలు విద్యావంతులు అవుతున్నందువల్లే ఒకప్పుడు 4.3గా ఉన్న జననాల రేటు ప్రస్తుతం 2.9కు తగ్గిందని, త్వరలోనే 2కు చేరుతుందని నితీశ్‌ అసెంబ్లీలో అన్నారు. ఈ విష‌యాలను చెప్పేందుకు ఆయ‌న కొంత ఘాటు భాష‌ను వాడారు.

"నితీష్ కుమార్ వ్యాఖ్యలు మహిళల హక్కులను భంగపరిచేవిలా ఉన్నాయి. ఇంతటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆయన క్షమాపణలు చెప్పాలి" అని జాతీయ మహిళా కమిషన్ ట్విట్టర్‌లో పేర్కొంది. 'నితీష్ మాట్లాడిన చెత్త వ్యాఖ్యలు మహిళల గౌరవానికి భంగం కలిగించాయి. అసెంబ్లీలో వాడిన ఇలాంటి అవమానకరమైన, చౌకబారు పదజాలం మన సమాజానికి ఓ మరక. ప్రజాస్వామ్యంలో సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే ఆ రాష్ట్రంలో మహిళల దుస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.' అని జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖా శర్మ అన్నారు.




Updated : 8 Nov 2023 7:45 AM GMT
Tags:    
Next Story
Share it
Top