Home > జాతీయం > Gautami: అన్నాడీఎంకేలో చేరిన సీనియర్ సినీనటి

Gautami: అన్నాడీఎంకేలో చేరిన సీనియర్ సినీనటి

Gautami: అన్నాడీఎంకేలో చేరిన సీనియర్ సినీనటి
X

ప్రముఖ సినీ నటి గౌతమి తాడిమల్ల.. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం(AIADMK) పార్టీ కండువా కప్పుకున్నారు. అన్నాడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ సీఎం ఎడప్పాటి పళనిస్వామి ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరారు. బుధవారం సాయంత్రం చెన్నైలోని గ్రీన్‌వేస్ రోడ్డులో ఉన్న పళనిస్వామి ఇంటికి వెళ్లిన గౌతమి.. ఆయనతో చర్చించారు. అనంతరం ఆమె అమ్మ (జయలలిత) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గౌతమి మీడియాతో మాట్లాడుతూ సరైన పార్టీలోకి తాను వచ్చానని పేర్కొన్నారు. దివంగత సీఎం అమ్మ జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేను సరైన మార్గంలో పళణి స్వామి నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పళనిస్వామి సమక్షంలో గౌతమి పార్టీలో చేరిన ఫోటో బయటికి వచ్చింది.

అయితే సుదీర్ఘ కాలం బీజేపీలో ఉన్న గౌతమి.. కొన్ని నెలల క్రితం ఆ పార్టీని వీడారు. అయితే గత కొన్ని నెలలుగా ఏ పార్టీలోకి వెళ్లకుండా ఉన్న గౌతమి.. ఎట్టకేలకు తన రాజకీయ అడుగు వేస్తూ ఏఐడీఎంకేలో చేరారు. 25 ఏళ్ల పాటు బీజేపీలో గౌతమి ఉన్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది అక్టోబరులో కమలం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. అయితే తాను ఆపదలో ఉన్నప్పుడు పార్టీ నుంచి మద్దతు కరవైందని ఆరోపిస్తూ గౌతమి బీజేపీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. తాజాగా అన్నాడీఎంకేలో చేరారు. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె అన్నాడీఎంకేలో చేరినట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంతోనే ఆమె పార్టీలో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరీ అన్నాడీఎంకే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇక గౌతమి.. 2004 నుంచి 2016 వరకు విశ్వనటుడు కమల్ హాసన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఆ తర్వాత ఆయనతో విడిపోయి వేరుగా ఉంటున్నారు.

Updated : 15 Feb 2024 2:45 AM GMT
Tags:    
Next Story
Share it
Top