Home > జాతీయం > తమిళనాడులో సీబీఐకి నో ఎంట్రీ

తమిళనాడులో సీబీఐకి నో ఎంట్రీ

తమిళనాడులో సీబీఐకి నో ఎంట్రీ
X

తమిళనాడు మంత్రి సెంథిల్​ బాలాజీని ఈడీ అదుపులోకి తీసుకున్న సమయంలో స్టాలిన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో సీబీఐ దర్యాప్తుకు అనుమతులు నిరాకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇష్టమున్నట్టు రాష్ట్రంలోకి సీబీఐ రావడానికి వీళ్లేదని తెలిపింది. కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తు..రాష్ట్రాలోని ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులకు గురిచేస్తోందని భావించిన తమిళనాడు ప్రభుత్వం తాజాగా ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.ఇకపై రాష్ట్రంలో ఎలాంటి విచారణ చేపట్టాలన్నా కేంద్ర దర్యాప్తు సంస్థలు తమిళనాడు ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఒక్క ఢిల్లీ మినహా మిగతా ఏ రాష్ట్రంలోనూ సీబీఐకి నేరుగా దర్యాఫ్తు చేసే అధికారంలేదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సాధారణ సమ్మతి(జనరల్ కన్సెంట్) తోనే కేసు విచారణను చేపట్టవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతిని ఈ చట్టం తప్పనిసరి చేసింది. గతంలో సమ్మతి తెలిపి ఆ తర్వాత ఉపసంహరించుకున్న రాష్ట్రాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికే దేశంలో 9 రాష్ట్రాలు సీబీఐ నో ఎంట్రీ బోర్డు పెట్టాయి. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కేరళ, మేఘాలయ, మిజోరాం, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌లో సీబీఐపై ఆంక్షలు ఉన్నాయి. ఈ లిస్ట్‌లో ఇప్పుడు తమిళనాడు చేరింది.

Updated : 14 Jun 2023 10:28 PM IST
Tags:    
Next Story
Share it
Top