Home > జాతీయం > M. K. Stalin : రూ.5060 కోట్లు ఇవ్వండి.. ప్రధానికి స్టాలిన్ లేఖ

M. K. Stalin : రూ.5060 కోట్లు ఇవ్వండి.. ప్రధానికి స్టాలిన్ లేఖ

M. K. Stalin : రూ.5060 కోట్లు ఇవ్వండి.. ప్రధానికి స్టాలిన్ లేఖ
X

మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడులో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. సోమ, మంగళవారాల్లో చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, నాగపట్నం, తిరువళ్లూరు మరియు కడలూరు జిల్లాలతో సహా ఉత్తర కోస్తా తమిళనాడులో భారీ వర్షాలు నమోదయ్యాయి. చెన్నైలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాల ధాటికి ఇప్పటివరకు 8 మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. భారీ న‌ష్టం సంభ‌వించిన నేప‌థ్యంలో.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఇవాళ కేంద్రానికి లేఖ రాశారు. త‌క్ష‌ణ‌మే రిలీఫ్ ఫండ్ కింద రూ.5060 కోట్లు ఇవ్వాల‌ని ప్ర‌ధాని మోదీని కోరుతూ సీఎం లేఖ రాశారు. మిచాంగ్ వ‌ల్ల న‌ష్టం జ‌రిగింద‌ని, ఆ న‌ష్టాన్ని అంచ‌నా వేసేందుకు కేంద్ర స‌ర్కారు బృందాన్ని పంపాల‌ని ఆయ‌న కోరారు. ఢిల్లీలో డీఎంకే ఎంపీ టీఆర్ బాలు స్వ‌యంగా ఆ లేఖ‌ను ప్ర‌ధాని మోదీకి అంద‌జేయ‌నున్నారు.

డిసెంబర్ 2, 3, 4 తేదీల్లో మైచాంగ్ తుఫాను కారణంగా చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు జిల్లాల్లో తీవ్ర వర్షపాతం నమోదైందని స్టాలిన్ తెలిపారు. తుఫాను తుఫాను నాలుగు జిల్లాల్లో, ముఖ్యంగా గ్రేటర్ చెన్నై కార్పొరేషన్‌పై భారీ ప్రభావాన్ని చూపిందని లేఖలో పేర్కొన్నారు. 'లక్షలాది మంది ప్రజల జీవనోపాధి దెబ్బతిందని.. మధ్యంతర సాయంగా తక్షణం రూ. 5,060 కోట్లను పరిహారంగా కోరినట్లు సీఎంఓ తన అధికారిక ప్రకటన ద్వారా తెలిపింది.

మిగ్‌జాం తుపాన్ కారణంగా కురిసిన అతి భారీ వర్షాలకు ఏపీలో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతింది. చేతికొచ్చిన వరి ధాన్యం నీటి పాలైంది. తుపాను కారణంగా శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి పలు విమాన సర్వీసులు అధికారుల రద్దు చేశారు. అటు రాయలసీమ ప్రాంతంలోనూ, ఇటు తెలంగాణలోనూ మిగ్‌జాం తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు నమోదయ్యాయి. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 96.8 మి.మీ వర్షం కురిసింది. నేడు, రేపు తెలంగాణలో వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది.




Updated : 6 Dec 2023 5:18 AM GMT
Tags:    
Next Story
Share it
Top