ప్రధాని ‘మన్ కీ బాత్’కు పోటీగా.. సీఎం స్టాలిన్ వినూత్న ప్రయత్నం
X
దేశంలో మూడోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ పావులు కదుపుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామిలివ్వడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే వంట గ్యాస్ సింలిండర్ పై ధరను రూ.200లకు తగ్గించింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ సమక్షంలోని బీజేపీ ప్రభుత్వంపై తమిళనాడు సీఎం స్టాలిన్ సంచల ఆరోపణలు చేశారు. దేశంలో బీజేపీ మరోసారి అధికారం రాకుండా చేసేందుకు స్టాలిన్ వినూత్న ప్రయత్నం మొదలుపెట్టారు. స్పీకింగ్ ఫర్ ఇండియా పేరుతో పాడ్ కాస్ట్ సిరీస్ ను మొదలుపెట్టారు. ఇండియా కూటమిలో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీని ఎదుర్కొనేందుకు ఇండియాకు బలమైన మద్దతునిచ్చేందుకు ఈ పాడ్ కాస్ట్ సిరీస్ ను ప్రారంభించారు స్టాలిన్. దీనిద్వారా జాతినుద్దేశించి మాట్లాడతామని స్టాలిన్ తెలిపారు.
ఈ క్రమంలో గురువారం (ఆగస్ట్ 31) ముంబైలో జరిగిన ఇండియా కూటమి మీటింగ్ కు ముందు ఆయన మాట్లాడిన పాడ్ కాస్ట్ వీడియోను విడుదల చేశారు. ఈ పాడ్ కాస్ట్ సిరీస్ ఉంగలిల్ ఒరువన్ తరహాలో ఉంటుందని తెలుస్తోంది. ఈ వీడియోలో.. తొమ్మిదేళ్ల పాలనలో దేశంలో బీజేపీ ప్రభుత్వం విధ్వంసం సృష్టించిందని విమర్శించారు. దేశం బాగుండాలంటే ప్రజలు బీజేపీకి ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. 2024 లోక్ సభ ఎన్నికల ద్వారా బీజేపీ ప్రభుత్వానికి ముగింపు పలకాలని అన్నారు. పాడ్ కాస్ట్ ద్వారా ఇండియా కూటమిని దేశంలోని సుదూర ప్రాంతాలకు తీసుకెళ్తామన్న ఆయన.. ఇంగ్లాష్ ఇతర భాషల్లో కూడా ఈ పాడ్ కాస్ట్ ఉంటుందని చెప్పారు.
தெற்கிலிருந்து ஓர் குரல்🖤❤🔥🔥🔥🔥🔥 தலைவா 💪💪💪 #SpeakingforINDIA @mkstalin pic.twitter.com/E12Y3uxI2w
— வரவணை செந்தில் (@Varavanaisen) August 31, 2023