Home > జాతీయం > టమాటాల ట్రక్ కొట్టేసిన జంట.. ఎట్టకేలకు చిక్కారు..

టమాటాల ట్రక్ కొట్టేసిన జంట.. ఎట్టకేలకు చిక్కారు..

టమాటాల ట్రక్ కొట్టేసిన జంట.. ఎట్టకేలకు చిక్కారు..
X

టమాటాల రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి. వర్షాలతో కొన్ని మార్కెట్లలో టమాటాలు కుళ్లిపోతున్న రేట్లు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం టామాటాల రేట్లు కేజీ 150కి పైగా ఉంది. టమాట ధరలు పెరగడంతో పలుచోట్లు దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఓ జంట సినిమా రేంజ్లో ఏకంగా టమాటాల వాహనాన్నే చోరీ చేసింది. ఈ ఘటన ఈ నెల 8న జరగ్గా.. తాజాగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

కర్నాటకలో జులై 8న శివన్న అనే రైతు ట్రక్లో హిరియూరు నుంచి కోలార్‌ మార్కెట్కు టమాటాలు తీసుకెళ్తున్నాడు. స్వయంగా అతడే నడుపుకుంటూ వెళ్లాడు. తమిళనాడులోని వేలూరుకు చెందిన భాస్కర్, సింధూజ దంపతులు చిక్కజాల వద్ద కాపుకాసి ట్రక్కు డాష్ ఇచ్చారు. అయితే ట్రక్ తమ కారును ఢీకొట్టిందని నష్ట పరిహారంగా డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో అక్కడికి మరో ముగ్గురు వచ్చారు. అయితే మల్లేష్ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో వారంతా అతన్ని బెదిరించారు. అంతటితో ఆగకుండా మల్లేష్‌ను కొట్టి టమాటాల లారీని తీసుకెళ్లారు. ఆ తర్వాత మల్లేష్ పోలీసులను ఆశ్రయించగా.. వారు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ పుటేజీ సాయంతో పోలీసులు లారీ ఎక్కడుందో కనిపెట్టారు. వెంటనే అక్కడికి వెళ్లి టమాటాల లారీని స్వాధీనం చేసుకోవడంతోపాటు దంపతులిద్దరిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు.




Updated : 23 July 2023 5:50 PM IST
Tags:    
Next Story
Share it
Top