Home > జాతీయం > Jallikattu:తమిళనాడులో అట్టహాసంగా ప్రారంభమైన జల్లికట్టు పోటీలు

Jallikattu:తమిళనాడులో అట్టహాసంగా ప్రారంభమైన జల్లికట్టు పోటీలు

Jallikattu:తమిళనాడులో అట్టహాసంగా ప్రారంభమైన జల్లికట్టు పోటీలు
X

సంక్రాంతి(పొంగల్) పండుగ సందర్భంగా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. మధురై జిల్లాలోని అవనియాపురం గ్రామంలో జల్లికట్టు పోటీల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. పోటీలో పాల్గొనే ఎద్దులకు హెల్త్ చెకప్ చేశారు. కాసేపటి క్రితం ప్రేక్షకుల హర్షధ్వానాల నడుమ అట్టహాసంగా పోటీలు ప్రారంభమయ్యాయి. జనవరి రెండో వారంలో పొంగల్ పంట పండుగ సందర్భంగా తమిళనాడులో జల్లికట్టు పోటీలను నిర్వహిస్తారు. వరుసగా మూడు రోజుల పాటు ఈ క్రీడలు కొనసాగుతాయి. మొదటి రోజు అవనియాపురంలో, రెండో రోజు పాలమేడులో, మూడో రోజు అలంగనల్లూరులో ఈ పోటీలను నిర్వహిస్తారు.

జల్లికట్టును తమిళనాట ఇరుతఝువుతాల్ అని కూడా పిలుస్తారు. జల్లికట్టు అనేది తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో ఆడే సంప్రదాయక క్రీడ. దీనిలో ఎద్దులకు మనుషులకు మధ్య పోరాటం జరుగుతుంది. జల్లుకట్టును తమిళనాడు సంస్కృతికి చిహ్నంగా పరిగణిస్తారు. అయితే జల్లికట్టు పోటీలలో పాల్గొనేవారు ఒక్కోసారి తీవ్రంగా గాయపడుతుంటారు. ఇటువంటి పరిస్థితులను గమనించిన సుప్రీంకోర్టు జల్లికట్టు నిర్వహణకు మార్గదర్శకాలను జారీ చేసింది. స్థానిక అధికారులు కట్టుదిద్దమైన ఏర్పాట్లు చేసినప్పటికీ జల్లికట్టు పోటీల సమయంలో పలువురు గాయపడుతున్నారు.

గత ఏడాది సంక్రాంతి సమయంలో అవనియాపురంలో నిర్వహించిన జల్లికట్టుపోటీల సమయంలో 60 మంది గాయపడ్డారు. కాగా, కొత్తగా నిర్మించిన మధురై జల్లికట్టు స్టేడియంను జనవరి 23న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించనున్నారు. మదురై జిల్లాలోని అలంగనల్లూరు సమీపంలో నిర్మిస్తున్న కొత్త జల్లికట్టు స్టేడియానికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత డీఎంకే అధినేత కరుణానిధి పేరు పెట్టారు.




Updated : 15 Jan 2024 10:25 AM IST
Tags:    
Next Story
Share it
Top