Home > జాతీయం > Vijay Thalapathy : పార్టీ బలోపేతంపై విజయ్ నజర్.. నేతలకు టార్గెట్

Vijay Thalapathy : పార్టీ బలోపేతంపై విజయ్ నజర్.. నేతలకు టార్గెట్

Vijay Thalapathy : పార్టీ బలోపేతంపై విజయ్ నజర్.. నేతలకు టార్గెట్
X

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ‘తమిళగ వెట్రి కళగం పేరుతో ఇటీవలే కొత్త పార్టీ పెట్టారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. తమిళనాడులో అవినీతి పాలన సాగుతోందని.. అవినీతిని అంతం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ క్రమంలో పార్టీ బలోపేతంపై విజయ్ ఫోకస్ పెట్టారు. పార్టీ నేతలతో సమావేశమైన ఆయన పలు కీలక సూచనలు చేశారు.

తమిళగ వెట్రి కళగం పార్టీ సభ్యుల సంఖ్య 2కోట్లకు చేరాలని పార్టీ నేతలకు ఆయన టార్గెట్ పెట్టారు. మహిళలుచ తొలిసారి ఓటు వేస్తున్న వారిని ఇందులో భాగస్వామ్యం చేయాలన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సభ్యత్వ నమోదు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా పార్టీ విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. పార్టీ కార్యకలాపాలకు అనుగుణంగా విజయ్ ఓ యాప్ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

Updated : 20 Feb 2024 11:07 AM IST
Tags:    
Next Story
Share it
Top