Home > జాతీయం > బీజేపీ మూడో జాబితా విడుదల.. తమిళిసై పోటీ ఎక్కడినుంచంటే..!

బీజేపీ మూడో జాబితా విడుదల.. తమిళిసై పోటీ ఎక్కడినుంచంటే..!

బీజేపీ మూడో జాబితా విడుదల.. తమిళిసై పోటీ ఎక్కడినుంచంటే..!
X

తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసి విషయం తెలిసిందే. పుదుచ్చేరి లెప్టినెంట్ పదవులకు కూడా రిజైన్ చేశారు. తమిళనాడు నుంచి లోక్ సభ ఎన్నికల్లో బరిలో దిగేందుకు రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. చెన్త్నె సౌత్, తిరునల్వేలి, కన్యాకుమారిలో ఒక చోట నుంచి ఎంపీగా పోటీ చేయునట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. తిరునల్వేలి, కన్యాకుమారిలో ఆమె సామాజిక వర్గం అయిన వాడర్ ఓట్లు అధికంగా ఉన్నాయి. కాగా ఈ స్థానాల నుంచే పోటీ చేస్తారని భావించారంతా. కానీ బీజేపీ తాజాగా విడుదల చేసిన మూడో జాబితాలో తమిళసై పోటీ చేసే స్థానంపై క్లారిటీ వచ్చింది.

తమిళనాడులోని 9 స్థానాలకు అభ్యర్థులను బీజేపీ తాజాగా ప్రకటించింది. చెన్నై సౌత్ నుంచి తమిళిసై బరిలో నిలవనున్నారు. కోయంబత్తూరు నుంచి అన్నామలై, చెన్నై సెంట్రల్ నుంచి వినయ్ పి.సెల్వం, వెల్లూర్ నుంచి ఏసీ షన్ముగం, కృష్ణగిరి నుంచి సి.నరసింహన్, నీలగిరి నుంచి మురుగన్, పెరంబళూర్ నుంచి పారివేంధర్, తూత్తుకుడి నుంచి నాగేంద్రన్, కన్యాకుమారి నుంచి రాధాకృష్ణన్ పోటీ చేయనున్నారు.

తమిళసై 2006లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి రామనాథపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఇప్పటివరకు ఒక్క విజయం దక్కలేదు. తమిళసై తండ్రి కమరి ఆనంద్ తమిళనాడు పీసీసీ చీఫ్ గా పని చేసారు. తమిళసై 1999 లో బీజేపీలో చేరారు. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షురాలిగా, జాతీయ కార్యదర్శిగా పదవులు నిర్వహించారు. ఆ తర్వాత 2009 పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరచెన్నై నియోజకవర్గం పోటీ చేసి ఓడిపోయారు. 2011, 2019 ఎన్నికల్లోనూ తమిళిసైకు ఓటమి తప్పలేదు. అనంతరం 2019లో తెలంగాణ గవర్నర్ గా ఎన్నికయ్యారు.

Updated : 21 March 2024 6:42 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top