Home > జాతీయం > మోడీ ఆ తప్పుడు వార్తల్ని ఎట్లా నమ్ముతారు..? - స్టాలిన్

మోడీ ఆ తప్పుడు వార్తల్ని ఎట్లా నమ్ముతారు..? - స్టాలిన్

మోడీ ఆ తప్పుడు వార్తల్ని ఎట్లా నమ్ముతారు..? - స్టాలిన్
X

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఈ అంశంపై స్పందించిన ప్రధాని నరేంద్రమోడీ సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్న వారికి ధీటుగా సమాధానం ఇవ్వాలని సూచించారు. ప్రధాని వ్యాఖ్యలపై తాజాగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. తన కొడుకు ఉదయనిధిని కొందరు టార్గెట్ చేశారని, ఆ లిస్టులో ప్రధాని మోడీ కూడా చేరారని విమర్శించారు.

ఉదయనిధిని ఎదుర్కోలేనే బీజేపీ అనుకూల శక్తులు తప్పడు కథనాలను ప్రచారం చేస్తున్నాయని స్టాలిన్ మండిపడ్డారు. తన కొడుకుప్రజలను రెచ్చగొట్టారని ప్రధాని మోడీ ఎలా అంటారని ప్రశ్నించారు. సనాతన ధర్మం భోధించే కొన్ని అమానవీయ సూత్రాల గురించి మాత్రమే ఉదయనిధి మాట్లాడారని, షెడ్యూల్డ్ కులాలు, గిరిజనులు, మహిళలపై వివక్ష చూసే సనాతన సూత్రాలపై తన అభిప్రాయం వ్యక్తం చేశారని సీఎం స్టాలిన్ అన్నారు. అంతేతప్ప ఆ వ్యాఖ్యల వెనుక ఏ మతాన్ని, మత విశ్వాసాలను కించపరిచే ఉద్దేశం లేదని చెప్పారు.

బీజేపీ పెంచి పోషిస్తున్న సోషల్ మీడియా గుంపు ఉత్తరాది రాష్ట్రాల్లో అబద్దాలను విస్తృతంగా ప్రచారం చేస్తోందని సీఎం స్టాలిన్ మండిపడ్డారు. ఉదయనిధి వ్యాఖ్యలపై సరైన స్పందన అవసరమని ప్రధాని కేబినెట్ భేటీలో అనడం చాలా బాధాకరమని, అసత్యాల గురించి మోడీ తెలిసి మాట్లాడుతున్నారా లేక తెలియక మాట్లాడుతున్నారా అని స్టాలిన్ ప్రశ్నించారు.

మరోవైపు తమిళనాడు మంత్రి ఏ. రాజా సైతం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై స్పందించారు. ఉదయనిధి సున్నిత మనస్కులైనందున సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ వ్యాధులతో పోల్చారని, అసలైతే సనాతన ధర్మాన్ని సమాజాన్ని భయపెట్టే హెచ్ఐవి, కుష్టు వ్యాధులతో పోల్చాలని అన్నారు. సనాతన ధర్మం, విశ్వకర్మ యోజన రెండు వేర్వేరు కాదని రెండూ ఒక్కటేనని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై డిబేట్ పెడితే చర్చలకు పెరియార్, అంబేద్కర్ పుస్తకాలను వెంట బెట్టుకుని ఢిల్లీ వస్తానని రాజా స్పష్టం చేశారు. తనపై రివార్డులు ప్రకటించినా ఎవరికీ భయపడనన్న ఆయన.. ఒకవేళ ప్రధాన మంత్రి చర్చలకు రమ్మన్నా వెళ్తానని చెప్పారు.

Updated : 7 Sept 2023 5:19 PM IST
Tags:    
Next Story
Share it
Top