Home > జాతీయం > వాట్‌ ఏ గ్రేట్ కల్చర్ సార్..సీఎం స్టాలిన్‎పై చిన్మయి ఫైర్

వాట్‌ ఏ గ్రేట్ కల్చర్ సార్..సీఎం స్టాలిన్‎పై చిన్మయి ఫైర్

వాట్‌ ఏ గ్రేట్ కల్చర్ సార్..సీఎం స్టాలిన్‎పై చిన్మయి ఫైర్
X

సింగర్ చిన్మయికి ఇంట్రడక్షన్ అవసరం లేదు. అద్భుతమైన గాత్రంతో ప్లేబ్యాక్ సింగర్‎గా ఫేమస్ అవ్వడమే కాదు, సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ మహిళలపై జరుగుతున్న అన్యాయాల గురించి తన గొంతును వినిపిస్తూ ఉంటుంది . గతంలో మీటూ ఉద్యమంలో భాగంగా పలువురు సినీ సెలబ్రిటీలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది చిన్మయి. తమిళ పాటల రచయిత వైరముత్తు తనను లైంగికంగా వేధింపులకు గురిచేశాడని సంచలన ఆరోపణలు చేసి ఇండస్ట్రీని షేక్ చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలతో చిన్మయిని కోలీవుడ్‌ ఇండస్ట్రీ నిషేధించింది. అయినప్పటికీ అప్పుడప్పుడు నెట్టింట్లో ఏదో రకంగా మహిళల సేఫ్టీ గురించి మాట్లాడుతూ తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తుంది. అయితే తాజాగా వైరముత్తు బర్త్ డే సందర్భంగా సీఎం స్టాలిన్ చేసిన పనికి మరోసారి చిన్మయి హెడ్‎లైన్స్‎లో నిలిచింది. ట్విటర్‌ వేదికగా ఏకంగా సీఎంపైనే ఫైర్ అయ్యింది.

తమిళనాడు సీఎంపై చిన్మయి చేసిన ట్వీట్ ఇప్పడు కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. వైరముత్తు బర్త్ డే కావడంతో స్టాలిన్ పర్సనల్‎గా ఆయన ఇంటికి వెళ్లి మరీ విషెస్ చెప్పారు. ఈ సంఘటన చిన్మయికి ఏమాత్ర మింగుడుపడలేదు. దీంతో ట్విటర్ వేదికగా స్టాలిన్ పై ట్వీట్ చేసింది.రాజకీయ నాయకులు మహిళల భద్రత గురించి మాట్లాడితే సిగ్గేస్తోందని ఇన్‎డైరెక్ట్‎గా ఘాటుగా విమర్శించింది. పొలిటీషిన్స్ అండ చూసుకునే ఇలాంటి వారు రెచ్చిపోతున్నారని ఆరోపించింది.

ట్వీట్‌లో చిన్మయి..." తమిళనాడు సీఎం పర్సనల్‎గా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వైరముత్తు ఇంటికి వెళ్లి మరీ అతని విషెస్ చెప్పడం ఏంటి. అలాంటిది నేను ఒక మహిళగా అతనిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినందుకు నన్ను తమిళ ఇండస్ట్రీ బ్యాన్ చేయడం ఏంటి. పొలిటీషియన్స్ అండ చూసుకునే ఒక రైటర్ ఏ స్త్రీపైనా చేయి వేయవచ్చని మైండ్ లో ఫిక్స్ అయిపోయాడు. ఆ అండ చూసుకునే వారి బలగం చూసే మౌనంగా ఉండమని ఓ మహిళను బెదిరించాడగలిగాడు. అందుకే అతనికి పద్మ అవార్డులు, సాహిత్య నాటక అకాడమీ, జాతీయ అవార్డులు. ఈ మనిషికి ఉన్న శక్తి ఇది. తమిళనాడులో చాలా వరకు రాజకీయ నాయకులు చేసే ప్రసంగాల్లో మహిళల భద్రతకు సంబంధించి మాట్లాడటం తలచుకుంటే సిగ్గేస్తోంది. అలాంటి రాజకీయ నాయకులు వైరముత్తు అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు మాత్రం సైలెంట్‎ అయిపోతారు. అదేంటంటే ప్రతి సంవత్సరం మహిళలను వేధించేవారు ఆనందంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారు. కానీ వాటిపై మాట్లాడిన మహిళలను మాత్రం వేధిస్తారు. ఈ భూమి మీద ఉన్న అద్భుతమైన సంప్రదాయం ఇది. ఇలాంటి భూమి మీద ప్రాథమికంగా దొరకని న్యాయం కోసం ఎదురుచూడటం చాలా బాధ కలిగించే విషయం' అంటూ ఎమోషనల్ ట్వీట్ చేసింది చిన్మయి


.

Updated : 14 July 2023 9:13 AM GMT
Tags:    
Next Story
Share it
Top